Car: ఎలక్షన్ ఏదైనా.. సెలక్షన్ కారే..

Car: తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ ఏదైనా ఓటర్ల సెక్షన్ మాత్రం కారు పార్టీయే అవుతోంది. నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికలో జనం గులాబీ పార్టీ వెంటే నిలిచినట్లు నిన్న ఆదివారం వెలువడ్డ ఫలితంలో తేలగా ఇవాళ సోమ వారం జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ లో సైతం ప్రజలు అధికార పార్టీకే మద్దతుగా నిలిచారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఐదు మున్సిపాలిటీలకు ఐదింటిని, రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకదాన్ని ఇప్పటికే సొంతం చేసుకుంది. మరో మున్సిపల్ కార్పొరేషన్ ని కూడా తన ఖాతాలోనే వేసుకునే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీలు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రూలింగ్ పార్టీ వశమయ్యాయి. ఖమ్మంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

car-party

2 కార్పొరేషన్లలో పరిస్థితి..

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 51 స్థానాల్లో ఘన విజయం సాధించింది. బీజేపీ 10 చోట్ల, కాంగ్రెస్ రెండు చోట్ల, ఇతరులు మూడు చోట్ల నెగ్గారు. ఖమ్మంలో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఇప్పటివరకు టీఆర్ఎస్ 33 స్థానాల్లో విక్టరీ సాధించింది. కాంగ్రెస్ 6 చోట్ల, బీజేపీ ఒక చోట, ఇతరులు 5 స్థానాల్లో సక్సెస్ అయ్యారు. ఇంకా 15 చోట్ల ఫలితం వెలువడాల్సి ఉంది.

car-party

5 మున్సిపాలిటీల్లో..

అచ్చంపేటలో మొత్తం 20 డివిజన్లకు గాను టీఆర్ఎస్-13, కాంగ్రెస్-6, బీజేపీ-1 గెలిచాయి. జడ్చర్లలో మొత్తం 27 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్-23, కాంగ్రెస్-2, బీజేపీ-2 నెగ్గాయి. కొత్తూరులో మొత్తం 12 డివిజన్లు ఉంటే టీఆర్ఎస్-7, కాంగ్రెస్-5 కైవసం చేసుకున్నాయి. నకిరేకల్ లో మొత్తం 20 డివిజన్లలో టీఆర్ఎస్-11, కాంగ్రెస్-2, ఇతరులు-7 పొందారు. ఇక్కడ కమలం పార్టీ ఖాతా తెరవలేదు. చివరగా సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ హవా బాగా నడిచింది. మొత్తం 43 డివిజన్లలో కారు పార్టీ ఏకంగా 36 స్థానాలను తన ఖాతాలో వేసుకుంటే ఇతరులు-6 చోట్ల, బీజేపీ ఒకే ఒక్క చోట గెలిచింది. దీన్నిబట్టి తెలంగాణలో హస్తం పార్టీ మరీ పూర్తిగా అంతరించిపోలేదని, కొద్దోగొప్పో ప్రభావం చూపుతోందని అర్థంచేసుకోవచ్చు. బీజేపీ ప్రభావం మాత్రం నిల్ అనే చెప్పాలి. ఆ పార్టీవి ఒట్టి బిల్డప్పులే అని తేలిపోయింది.

Advertisement