కూకట్ పల్లిలో కారు బీభత్సం. ఒకరు మృతి

Advertisement

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అయితే సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. అయితే అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఓ ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇక ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతి చెందిన యువకుడి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here