Virataparvam : విరాటప‌ర్వం టీజ‌ర్‌లో ఈ ఆస‌క్తిక‌ర అంశం గ‌మ‌నించారా..!

Virataparvam :ద‌గ్గుబాటి రానా, గ్లామ‌ర్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి జంట‌గా వేణు ఉడుగులు తెర‌కెక్కిస్తున్న చిత్రం విరాట‌ప‌ర్వం. హృద్య‌మైన భావోద్వేగంతో అంద‌మైన ప్రేమ క‌థ‌గా తెర‌కెక్కిన విరాట‌ప‌ర్వం చిత్రంలో నవీన్‌ చంద్ర, ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్ బాబు సమర్పిస్తున్నారు. ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజ‌ర్‌ను గురువారం సాయంత్రం చిరంజీవి విడుద‌ల చేశారు. ఇందులో రానా, సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా ఉండ‌డంతో పాటు సినిమాపై అంచ‌నాలు పెంచాయి.

న‌క్స‌లైట్ బ్యాక్‌డ్రాప్ లో తెర‌కెక్కిన విరాట ప‌ర్వం చిత్రంలో ర‌వి.. న‌క్స‌లైట్ ర‌వ‌న్న‌గా ఎందుకు మార‌తాడు అనేది ఆస‌క్తిక‌రంగా చూపించ‌నున్నారు. అలానే రానా, సాయి ప‌ల్ల‌విల మధ్య ప్రేమ ఎలా పుడుతుంది. అత‌డిని చూడ‌కుండానే ఆయన రాసిన క‌విత‌లో సాయి ప‌ల్ల‌వి ప్రేమ‌లో ఎలా ప‌డుతుంది అనే అంశాలు ప్రేక్ష‌కుల‌కి ఆస‌క్తిని క‌లిగించేవిగా ఉంటాయి. అయితే తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌లో చాలా మంది ఈ విష‌యం గ‌మ‌నించి ఉండ‌కపోవ‌చ్చు. విరాట ప‌ర్వం చిత్రంలో రానా పెన్ నేమ్ అరణ్య‌. ఈ పేరుతోనే రానా ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. అర‌ణ్య చిత్రంలో రానా మావ‌టివాడి పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు.

అర‌ణ్య‌గా రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్న రానా ప్రేక్ష‌కుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తాడ‌ట‌. రానా న‌టించిన అర‌ణ్య చిత్రం మార్చి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఏప్రిల్ 30న విరాట ప‌ర్వం చిత్రాన్ని థియేటర్స్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. విరాట ప‌ర్వం టీజ‌ర్
”ఆదిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్లు.. తారతమ్య గోడలనే పెకిలించగా ఎన్నినాళ్లు..” అంటూ గంభీరమైన రానా వాయిస్‌తో మొద‌లు కాగా, ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్‌ ఇస్తూ.. దర్శకుడు స్టోరీ చెప్పిన విధానం బాగుంది. చిరంజీవి కూడా ఈ టీజ‌ర్‌కు ఫిదా అయ్యారు. సినిమా త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌ని అన్నారు.

Advertisement