Mysore Maharaj : డబ్బు వర్సెస్ ఆరోగ్యం..మైసూర్ మహారాజు ని ఏది కాపాడింది

Mysore Maharaj(మైసూర్ మహారాజు) :  డబ్బుంటే ఏదైనా చేసేయొచ్చు అనుకుంటారు. డబ్బుంటే ఏదైనా మన కాళ్ళ దగ్గర కు వస్తుంది అనుకుంటారు. డబ్బుతో కొనగలిగేదేదీ లేదని, డబ్బుంటే ఎవరు లేకున్నా పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు.. డబ్బు ఉంటే ఆరోగ్యం సైతం కొనవచ్చు అనుకుంటారు.. మన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా డబ్బుతో విచ్చలవిడిగా ఏది చేస్తూ ఉంటారు.. కానీ ఎన్నో ఘటనలు , ఎన్నో ఉదాహరణలు మనకు డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యం చెప్తున్నాయి..

Can We Buy Health with Wealth : మైసూర్ మహారాజు
Can We Buy Health with Wealth

డబ్బుతో ఏదైనా కొనొచ్చేమో కానీ ఆరోగ్యాన్ని సంతోషాన్ని మాత్రం కొనలేము ఎంత ధనం వున్నా పోయే ప్రాణాన్ని నిలబెట్టగల చెప్పండి .. దానికి ఉదాహరణ మైసూర్ రాజు శ్రీకాంత దత్త నరసింహరాజ వడియార్.. మైసూరు రాజ్యానికి చివరి రాజైన శ్రీకాంత్ దత్త సకల రాజభోగాలను అనుభవించాడు.. చక్కని ఆహారం దుస్తులు అందుబాటులో ఉండేవి అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపిన ఒడియార్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గా మూడు సార్లు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించాడు.. అంత రాజభోగాలను అనుభవించిన అతని దగ్గర ఉండేది కాదు..

అందరితోనూ హుందాగా మెలిగేవాడు ఆయన. అయితే ఆయనకు ఒకటే సమస్య స్థూలకాయం.. అది వంశపారంపర్యంగా వచ్చింది.. దీనికి తోడు ఆయన వ్యాయామం చేసేవాడు కాదు.. దీంతో 120 కిలోల వరకు బరువు పెరిగాడు.. ఈ క్రమంలో ఆయనకు డయాబెటిస్ హైబీపీ సమస్య వచ్చింది.. ఎంత డబ్బు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్న కంట్రోల్ కాలేదు.. ఫలితంగా లైపోసెక్షన్ చేయించుకున్నాడు.. దాని ద్వారా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి.. రెండుసార్లు గుండెపోటు వచ్చింది.. అదే హార్ట్ అటాక్ కారణంగా 60 వ ఏట చనిపోయాడు . దీన్నిబట్టి ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం లేకుంటే చివరికి కాటికే..

Advertisement