Diabetes : షుగర్ వ్యాధి వస్తే ద్రాక్ష తినాలా? తినకూడదా? ఏ పండ్లు తింటే మేలు?

Ajay G - March 31, 2021 / 12:48 PM IST

Diabetes : షుగర్ వ్యాధి వస్తే ద్రాక్ష తినాలా? తినకూడదా? ఏ పండ్లు తింటే మేలు?

Diabetes : షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే చాలు.. ఇక జీవితాంతం ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిందే. ప్రతిరోజు.. షుగర్ కంట్రోల్ మెడిసిన్ వాడాల్సిందే… అనే అపోహలో చాలామంది ఉంటారు. ఏదైనా తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అమ్మో షుగర్ వచ్చింది. ఇది తింటే షుగర్ పెరుగుతుందేమో అని భయపడిపోతుంటారు. కొందరైతే పండ్లు కూడా తినరు. పండ్లు తింటే షుగర్ పెరుగుతుందట అంటూ బెంబేలెత్తిపోతుంటారు.

can diabetes patients eat grapes

can diabetes patients eat grapes

కానీ… షుగర్ వస్తే జీవితంలో ఇక తగ్గదు అనేది అపోహ మాత్రమే. కొన్ని రకాల ఆహారాలను వదులుకొని.. కొన్ని రకాల ఆహారాలను రోజువారి ఫుడ్ లో భాగం చేసుకుంటే… ఖచ్చితంగా షుగర్ వ్యాధిని తరిమికొట్టొచ్చు.

అయితే… షుగర్ వస్తే… ఏ పండ్లు తినాలి? ఏపండ్లు తినకూడదు. గ్రేప్స్ తినొచ్చా? లేదా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. కానీ.. ద్రాక్షను డయాబెటిస్ వ్యాధి వచ్చిన వాళ్లు శుభ్రంగా తినొచ్చట. ద్రాక్ష పండ్లలో రెస్వెరాట్రాల్ అనే ఒక ఫైటో కెమికల్ ఉంటుంది. అది రక్తంలోని గ్లూకోజ్ ను నియంత్రిస్తుంది.

అయితే… షుగర్ తో బాధపడుతున్నవాళ్లు తెల్లని ద్రాక్ష కన్నా… నల్లని ద్రాక్ష తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. నల్లద్రాక్ష అయితేనే డయాబెటిస్ కు చక్కని మందులా పనిచేస్తుందని.. షుగర్ కంట్రోల్ లో ఉండటానికి ద్రాక్ష సహాయ పడుతుందని చెబుతున్నారు.

అలాగే.. డయాబెటిస్ తో బాధపడుతున్నవాళ్లు… నల్లద్రాక్షతో పాటుగా బ్లూబెర్రీ, యాపిల్స్, స్ట్రాబెర్రీస్, జామపండ్లు, పుచ్చకాయ, బొప్పాయి, ఆరెంజ్ పండ్లను తినొచ్చు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us