California Students: కండోమ్స్ వాడండి.. ధృవపు ఎలుగబంట్లను రక్షించండి అంటూ వినూత్న ప్ర‌చారం

California Students:రోజు రోజుకు భూమిపై మ‌నుషుల సంఖ్య పెరుగుతూ పోతుంది.దీని వ‌ల‌న ప్ర‌కృతి, జీవరాశులు దెబ్బ‌తింటున్నాయి. అపరిమిత వస్తు వినియోగం, స్వార్థం.. ఇతర జీవాల పాలిట శాపంగా మారాయి. గత 50 ఏళ్లలో జనాభా రెండురెట్లకు పైగా పెరిగితే..ఇతర జీవజాతుల సంఖ్య సగానికి పడిపోయింది. రాను రాను జీవ జాతులు అంతరించిపోతున్నాయి. ఈ క్ర‌మంలో కాలిఫోర్నియాలోని సెంటర్ ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ ఓ వినూత్న ప్రచారానికి తెరలేపింది.

California Students: Use a Condom, Save the Polar Bears
California Students: Use a Condom, Save the Polar Bears

ఈ నెల 25న వరల్డ్ కాంట్రసెప్టివ్ డేను పురస్కరించుకుని కాలిఫోర్నియాలోని 12 విద్యాసంస్థల్లో స్టూడెంట్స్‌కు కండోమ్ ప్యాకెట్లను పంచిపెట్టారు. అంతరించిపోతున్న జీవాల చిత్రాలను ఆ కండోమ్‌ ప్యాకెట్లపై ముద్రిస్తూ..ప్రకృతిని కాపాడాలనే సందేశాన్ని ఇచ్చారు. ‘‘కండోమ్స్ వాడండి.. ధృవపు ఎలుగబంట్లను రక్షించండీ’’ అంటూ ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. కండమ్స్ వాడ‌డం వ‌ల‌న జ‌నాభా పెరుగుద‌ల‌ని నియంత్రించ వ‌చ్చు అని అంటున్నారు.

జ‌నాభా నియ‌త్ర‌ణ ద్వారా ప్రకృతిని కాపాడుకోవచ్చనే అంశంపై ప్రజల్లో ఒకసారి చర్చ మొదలైతే.. అది ప్రకృతి పరిరక్షణవైపు తొలి అడుగుగా మారుతుంది’’ అని సెంటర్ ఫర్ బయోలాజికల్ డైవర్శిటీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అదుపు తప్పిన జనాభా పెరుగుదుల,వ‌ల‌న అనేక జీవజాతులు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయని పేర్కొంది. ఈ ప్ర‌చారం చాలా మందిని ఆక‌ట్టుకుంటుంది.