Calf : 8 కాళ్ళతో వింత దూడ జననం.! దేవుడి మహిమేనంటున్న ప్రజలు.!
NQ Staff - December 24, 2022 / 06:02 PM IST

Calf : సృష్టిలో చాలా వింతలు, విశేషాలు చోటు చేసుకుంటుంటాయ్. వాటికి ‘సైంటిఫిక్ కోణాన్ని’ ఆవిష్కరించేందుకు శాస్త్రవేత్తలూ ప్రయత్నిస్తుంటారు. అది వేరే సంగతి.
కొద్ది రోజుల క్రితం నాలుగు కాళ్ళతో వున్న శిశువుకి ఓ మహిళ జన్మనిచ్చిన విషయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. నిజానికి, అది జన్యు లోపంతో జరుగుతుంటుంది.
శరీరాలు అతుక్కుపోయి జన్మించిన వీణ – వాణి మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. ఆ ఇద్దరూ ఇప్పటికీ కలిసేవున్నారు. వారిని విడదీయడం సాధ్యమయ్యే పని కాదు.
8 కాళ్ళతో దూడ జననం..
తాజాగా ఓ దూడ 8 కాళ్ళతో జన్మించింది. సాధారణంగా అయితే దూడకి నాలుగు కాళ్ళు మాత్రమే వుంటాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది.
తొలుత వింత జీవి అనుకున్నారు. ఆ తర్వాత దేవుడి మహిమ.. అంటూ ప్రచారం జరగడంతో పెద్ద సంఖ్యలో ఆ వింత దూడని చూసేందుకు జనం వచ్చారు.
చివరికి అది కూడా జన్యులోపంతో పుట్టిన దూడ అని పశు వైద్యులు తేల్చేసరికి అంతా సైలెంటయిపోయారు. గర్భస్థ దశలో జన్యు సమస్యల వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి.