Heavy Rains: భారీ వ‌ర్షాల‌తో నిలిచిపోయిన క్యాబ్స్.. ట్రాక్ట‌ర్‌లో ఎయిర్‌పోర్ట్‌కి..!

Heavy Rains: గ‌త కొద్ది రోజులుగా అంత‌టా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల‌లో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు పూర్తిగా స్తంభించిపోయింది. సోమ‌వారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షాన్ని జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బెంగళూరు ప‌ట్ట‌ణం కూడా పూర్తి జ‌ల‌మ‌యం అయింది. దీంతో ప‌ట్ట‌ణ వాసులతో పాటు ప్రయాణీకులు కూడా చాలా ఇబ్బందులు ప‌డ్డారు.

అల్ప పీడ‌నం వ‌ల‌న బెంగ‌ళూరులోని కెంపేగౌడ అంత‌ర్జాతీయ విమానాశ్రయం, దాని ప‌రిస‌రాల్లోకి భారీగా వరద నీరు చేరింది. వరద ధాటికి విమానాశ్రయానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో క్యాబ్స్ ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. చేసేదేం లేక‌ కొంత‌మంది ప్రయాణికులు అయితే ట్రాక్టర్లల్లో సైతం ప్రయాణం చేశారు. ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు వారు ట్రాక్టర్లల్లో ప్రయాణం చేశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా, సరైన ప్రణాళిక లేకపోవడంతో నీరు నిలిచిపోయినట్లు ప్రయాణికులు అసహనం వ్యక్తంచేశారు. మంగ‌ళవారం కూడా అక్క‌డ ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గ‌తంలో ప‌లు ప్రాంతాలలో కూడా ఇలాంటి ప‌రిస్థితులు మ‌నం చూశాం.ఇటీవ‌ల తెలంగాణ‌లోక‌లెక్ట‌రేట్ వ‌ర‌ద‌ల‌లో మునిగిపోవ‌డంతో సిబ్బంది అంతా ట్రాక్ట‌ర్‌లో వెళ్లిన విష‌యం తెలిసిందే.