Business Man : రూ.24 వేల కోట్ల విరాళం.. ఇతని కంటే నిజమైన శ్రీమంతులు ఉంటారా?

NQ Staff - September 17, 2022 / 09:51 AM IST

Business Man : రూ.24 వేల కోట్ల విరాళం.. ఇతని కంటే నిజమైన శ్రీమంతులు ఉంటారా?

Business Man : వందల కోట్ల ఆస్తులు ఉన్నవాళ్లు కనీసం లక్షల్లో కూడా సాయం చేసేందుకు ముందుకు రారు, అలాంటిది ఒక వ్యాపారి ఏకంగా 24 వేల కోట్ల విరాళంలో ఇచ్చేందుకు ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్య పరచుతున్నాడు. కేవలం పర్యావరణ పరిరక్షణ కోసం అతడు ఈ విరాళంను ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు.

Business Man Donates 24 Crores for Environmental protection

Business Man Donates 24 Crores for Environmental protection

ఒక లాభాపేక్ష లేని ట్రస్ట్ కి ఈ విరాళంను ఇచ్చినట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఆ వ్యాపారవేత్త యొక్క కుటుంబ సభ్యులకు కూడా అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. యూఎస్ఏ కు చెందిన వ్యాపారవేత్త యోవోన్ చుయ్‌నార్డ్‌ తన కంపెనీ పెటగోనియో ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకై భారీ విరాళంను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

వాతావరణ మార్పులు, జీవ వైవిద్యం అటవీ భూములు ఇలా అన్ని విషయాలను సంరక్షించేందుకు గాను ఆయన ఈ విరాళంను అందిస్తున్నట్లుగా ప్రకటించాడు. ఈ విరాళంపై ఆ వ్యాపారవేత్త స్పందిస్తూ ప్రకృతి అందిస్తున్న ఎన్నో వనరులను మనం ఉపయోగించుకుంటున్నాం.. కనుక తన సంపాదనను తిరిగి ప్రకృతికే అందిస్తున్నాను అన్నాడు.

తన పెట్టగొనియో సంస్థ ద్వారా సంవత్సరానికి 1 బిలియన్‌ డాలర్ల వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. ఆయన 50 ఏళ్లుగా వ్యాపారంలో ఉన్నారు. భారీ లాభాలను సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు తన ఆదాయంలో పెద్ద వాటాను విరాళంగా ఇచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీమంతుడిగా పేరు దక్కించుకున్నాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us