Cat: నా పిల్లి త‌ప్పిపోయింది… తెచ్చి ఇచ్చిన వారికి అదిరిపోయే గిఫ్ట్..!

Cat: ఇటీవ‌లి కాలంలో చాలా మంది మూగ‌జీవాల‌ను ప్రాణంగా చూసుకుంటున్నారు.కుక్క‌లు, పిల్లులు,గుర్రాలని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ వ‌స్తున్నారు. వాటికి ఏదైన జ‌రిగితే విల‌విల‌లాడిపోతున్నారు. తాజాగా ఓ మ‌హిళ త‌న పిల్లి త‌ప్పిపోయింద‌ని దానిని తెచ్చి ఇచ్చిన వారికి బంప‌ర్ గిఫ్ట్ ఇస్తానంటూ వీడియో విడుద‌ల చేసింది.

Cat

మీడియాతో మాట్లాడిన మ‌హిళ త‌న పిల్లి( జింజ‌ర్) త‌ప్పిపోయింద‌ని, దానిని సొంత కిడ్‌లా పెంచుకున్నాన‌ని పేర్కొంది. ఎవరికైనా కనిపిస్తే ఈ నెంబర్‌కు 6301559247 కాంటాక్టు చేయాలని ఆమె కోరారు. ఆ పిల్లి మెడికల్ కండిషన్‌లో ఉందని, దానికి వెంటనే చికిత్స చేయాల్సి ఉందని అన్నారు.

జూన్ 24న పిల్లి త‌ప్పిపోగా, ఇంకా ఆ పిల్లి కోసం వేతుకుతూనే ఉన్నాం. దాని జాడ తెలియ‌క చాలా ఆవేద‌న చెందుతున్నాం. ఇప్ప‌టికే సీతారాంబాగ్‌లో ఉన్న యానిమల్ హజ్బండరీకి కూడా ఫిర్యాదు చేశామని స‌ద‌రు మ‌హిళ చెప్పారు.మ‌హిళ మాట‌లు వింటుంటే పిల్లిపై ఆమెకున్న ప్రేమ అర్ధ‌మ‌వుతుంది.

ఆ మ‌ధ్య రైల్వే స్టేషన్ లో రైలు కోసం వేచి చూస్తుండగా.. పెద్ద శబ్దం వినపడటంతో చేతుల నుంచి పిల్లి పారిపోయింది. రైల్వే స్టేషన్ మొత్తం గాలించినా దాని జాడ దొరకలేదు. దీంతో దానిని పట్టిచ్చినవారికి నగదు బహుమానం ప్రకటించారు.అయితే ఆ పిల్లిని ప‌ట్టుకుంది ఎవ‌రో కాదు నేపాల్ మాజీ ఎన్నికల కమిషనర్ ఐలా శర్మ.