Crime News : ప్రియురాల్ని హత్య చేసి.. 35 ముక్కలుగా కోసి.. ఢిల్లీ అంతటా విసిరి.!
NQ Staff - November 14, 2022 / 04:47 PM IST

Crime News : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్య చోటు చేసుకుంది. ప్రియురాల్ని, ప్రియుడే అత్యంత కిరాతకంగా చంపేశాడు. ‘పెళ్ళి చేసుకోమని’ ప్రియుడి మీద ఆ ప్రియురాలు ఒత్తిడి తీసుకురావడమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు.
నిందితుడు ముంబైకి చెందిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా కాగా, మృతురాలు శ్రద్ధా. ముంబైలోని ఓ కాల్ సెంటర్లో శ్రద్ధా పని చేసేది. అక్కడే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. అయితే, వీరి పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు. దాంతో, ఇద్దరూ ముంబై నుంచి ఢిల్లీకి పారి పోయారు.
సహజీవనం.. మనస్పర్ధలు..
ముంబైలో శ్రద్ధా, ఆప్తాబ్ సహజీవనం చేస్తూ వున్నారు. అయితే, పెళ్ళి విషయమై ఇద్దరూ తరచూ గొడవలు పడేవారని తెలుస్తోంది. ఆ గొడవలు ముదిరి, శ్రద్ధాను అమీన్ హత్య చేశారు. మే 18న హత్య జరిగింది.
శ్రద్ధాని హత్య చేసిన అమీన్, మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్లో దాచిపెట్టాడు. అర్థరాత్రి సమయంలో ఆ ముక్కల్లో కొన్నింటిని తీస్తూ, వాటిని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరవేస్తూ వచ్చాడు.
అలా పద్ధెనిమిది రోజులపాటు ఆ మృతదేహం తాలూకు భాగాల్ని ఢిల్లీలోని చాలా చోట్ల విసిరి పారేశాడు. శ్రద్ధా కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించడంతో హత్య విషయం వెలుగు చూసింది.