Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి అన్నది కూడా నిజమేనేమో.. అలాగే జరుగుతుందేమో!
NQ Staff - February 15, 2023 / 06:07 PM IST

Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతల ఖండిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ ఏర్పడడం ఖాయమని, కచ్చితంగా టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు మరియు సీనియర్ రాజకీయ నాయకులు సీరియస్ గా తీసుకుంటున్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమే అయి ఉంటాయి అంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కలిసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. హంగ్ ఏర్పడితే బీజేపీతో కంటే కూడా కాంగ్రెస్ తో కలిసేందుకు కేసీఆర్ ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ మరియు బిజెపి పరిస్థితి కాస్త వెనుకబడింది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎన్నికల సమయానికి మూడు పార్టీలు కూడా హేమా హేమీలుగా తలపడితే కచ్చితంగా హంగ్ ఏర్పడడం ఖాయం.
అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ హంగ్ అనేది ఏర్పడితే సీఎం కేసీఆర్ చేయబోతున్న పని ఏంటీ అంటూ ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారట. కానీ కేసీఆర్ మాత్రం అస్సలు తగ్గేది లేదు సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్నాడట. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.