IT Department : బీఆర్ ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇంట్లో ఐటీ దాడులు..!
NQ Staff - June 14, 2023 / 11:02 AM IST

IT Department : బీఆర్ ఎస్ నేతలపై మళ్లీ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రీసెంట్ గానే ఐటీ దాడులు నిర్వహించారు. ఇప్పుడు తాజాగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఎంపీ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. శేఖర్ రెడ్డి కి సంబంధించిన ఓ కంపెనీకి కొత్త ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా నాగర్ కర్నూల్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్ పై కూడా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు.

BRS MLA Payla Shekhar Reddy House Inspected By IT Department
కేపి.హెచ్.బి కాలనీ లోని జేసీ బ్రదర్స్ లో ఐటి శాఖ అధికారుల తనిఖీలు. జేసీ బ్రదర్స్ శాపింగ్ మాల్స్ కు జనార్ధన్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. జేసీ బ్రదర్స్ లో జరిగిన లావాదేవీలు పై ఆరా తీస్తున్నారు అధికారులు. ఇరు ఒకే సారి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఇంట్లో దాడులు నిర్వహించేసరికి బీఆర్ ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది.