BRS: నేషనల్ మీడియాలో భారీ ఎత్తున బీఆర్ఎస్ బహిరంగ సభ…!
NQ Staff - January 17, 2023 / 10:45 AM IST

BRS : ఖమ్మంలో జరగబోతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈనెల 18 వ తారీఖున జరగబోతున్న ఈ సభ యావత్ దేశం దృష్టిని ఆకర్షించాలని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకోసం జాతీయ మీడియా ను పెద్ద ఎత్తున బహిరంగ సభ మరియు ఇతర కార్యక్రమాలను కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా బీఆర్ఎస్ కార్యక్రమాలను రాష్ట్ర మీడియా మాత్రమే కవర్ చేస్తూ ఉంటుంది, కానీ ఈసారి జాతీయ స్థాయి సభ అంటూ పలు రాష్ట్రాల నుండి నాయకులను ఆహ్వానించారు.
అందుకే జాతీయ మీడియా ఈ మీటింగ్ ను పెద్ద ఎత్తున కవర్ చేయాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. అందుకోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. జాతీయ మీడియాకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారట, అంతే కాకుండా చేరవలసిన వారికి నిధులు కూడా చేరుతున్నాయని సమాచారం అందుతుంది.
మొత్తానికి బీఆర్ఎస్ యొక్క మొదటి బహిరంగ సభ జాతీయ మీడియా సంస్థల్లో ప్రముఖంగా ప్రచారం జరిగే అవకాశం ఉంది. బిజెపి ప్రభుత్వాన్ని ఢీ కొట్టాలంటే జాతీయ స్థాయిలో భారీ ప్రచారం అవసరం.. అందుకే కేసిఆర్ వ్యూహాత్మకంగా ఈ ఆవిర్భావ బహిరంగ సభను అత్యంత భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
100 ఎకరాల్లో సభ ప్రాంగణం.. 400 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. 15 వేల మంది వీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మూడు లక్షల మంది పార్టీ కార్యకర్తలు హాజరు కాబోతుండగా, 20 వేల మంది వీఐపీలు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి హాజరు కాబోతున్నారట.. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు జరిగాయి.