Bro Movie Pre Release Being Organized On Grand Event : హలో ‘బ్రో’ ప్లీజ్ రావద్దు

NQ Staff - July 25, 2023 / 07:05 PM IST

Bro Movie Pre Release Being Organized On Grand Event : హలో ‘బ్రో’ ప్లీజ్ రావద్దు

Bro Movie Pre Release Being Organized On Grand Event :

పవన్ కళ్యాణ్‌, సాయి ధరమ్ తేజ్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘బ్రో’ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో భారీ ఎత్తున అభిమానులు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది.

రెండు రోజుల ముందు నుండే హైదరాబాద్ శిల్ప కళావేదిక వద్ద హడావిడి మొదలైంది. దాంతో కచ్చితంగా భారీ ఎత్తున జనాలు వస్తారని ముందే ఊహించిన యూనిట్‌ సభ్యులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు జనాలు రావద్దు అంటూ సూచించారు. భారీ ఎత్తున ఆశలు పెట్టుకుని ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్న వారికి అయ్యో అన్నట్లుగా వెనక్కి తిరుగుతున్నారు.

లైవ్‌ చూసి ఎంజాయ్ చేయండి…

నేటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా గౌరవ పోలీసు శాఖ వారి సూచనల మేరకు అనుకున్న సమాయం కన్న వేడుక కొంత ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. విచ్చేసే అభిమాన ప్రేక్షకులు దీనిని దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు పడకుండా టి వి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వేడుకను వీక్షించ గలరు అని మనవి అంటూ పీఆర్‌ అధికారికంగా ట్వీట్‌ చేయడం జరిగింది.

Bro Movie Pre Release Being Organized On Grand Event

Bro Movie Pre Release Being Organized On Grand Event

దాంతో అభిమానులు వెళ్లాలి అనుకున్న వారు కూడా వెనక్కి తిరిగారు. అక్కడికి వెళ్లిన వారు కూడా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ తో పాటు రామ్‌ చరణ్ ఈ వేడుకలో పాల్గొంటారు అంటూ వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అభిమానులకు తీవ్ర నిరాశ అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us