Shooting Of Movie Guntur Karam Will Delayed : పవన్ సినిమాల వల్ల ‘గుంటూరు కారం’ ఆలస్యం.. కోట్లలో నష్టం..!
NQ Staff - June 26, 2023 / 10:55 AM IST

Shooting Of Movie Guntur Karam Will Delayed : త్రివిక్రమ్ చేస్తున్న పనుల వల్ల మహేశ్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా ఆలస్యం అవుతోంది. దీనంతటికీ కారణం పవన్ సినిమాలే అని ఆరోపిస్తున్నారు మహేశ్ బాబు. పవన్ కు త్రివిక్రమ్ మంచి స్నేహితుడు. పవన్ సినిమాలను త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటారు. గతంలో భీమ్లానాయక్ సినిమాకు ఆయనే అన్నీ చూసుకున్నారు.
ఇప్పుడు పవన్ హీరోగా వస్తున్న బ్రో సినిమాకు త్రివిక్రమ్ డైరెక్షన్ పర్యవేక్షణ చేస్తున్నారు. దాంతో మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాను పట్టించుకోవట్లేదనే వాదన మొదటి నుంచి వినిపిస్తోంది. వారు చెబుతున్నట్టే త్రివిక్రమ్ గతంలో తీసిన యాక్షన్ సీన్టు సరిగ్గా రాలేదు. దాంతో మహేశ్ బాబుకు నచ్చకపోవడంతో రీషూట్ చేశారు.
వీటికే రూ.5 కోట్ల దాకా ఖర్చు అయిందంట. ఇక సినిమా ఆలస్యం కావడంతో పూజాహెగ్డే కూడా తప్పుకుంది. దాంతో ఆమెతో షూట్ చేసిన ఎపిసోడ్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలతో ఆ సీన్లన్నీ రీషూట్ చేయాల్సి వస్తోంది. దాంతో వీటికి మరింత ఖర్చు అవుతోంది.
శ్రీలీలతో ఇంతకు ముందు తీసిన సీన్లు కూడా వేస్ట్ అయ్యాయి. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న మీనాక్షి చౌదరితో ఆ సీన్లు రీషూట్ చేయాల్సి వస్తంది. ఇలా రిలీజ్ కు ముందే ఈ సినిమాకు రూ.10 కోట్ల వరకు నష్టాలు వస్తున్నాయి. ఇదంతా త్రివిక్రమ్ వల్లే అని ఫైర్ అవుతున్నారు మహేశ్ ఫ్యాన్స్.