Bro Movie Budget New Update :  బ్రో మూవీ బడ్జెట్‌ ఎంత? బిజినెస్ ఎంతో తెలుసా?

NQ Staff - July 7, 2023 / 07:26 PM IST

Bro Movie Budget New Update :  బ్రో మూవీ బడ్జెట్‌ ఎంత? బిజినెస్ ఎంతో తెలుసా?

Bro Movie Budget New Update :

తమిళంలో సూపర్ హిట్ అయినా వినోదయ సితం ను తెలుగులో బ్రో అనే టైటిల్ తో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి.

ఇటీవలే బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ ముగించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయాలని నిర్ణయించారు. మరో వైపు సినిమా బిజినెస్ వ్యవహారాలు కూడా పూర్తి అయినట్లుగా సమాచారం అందుతుంది.

ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ భారీ రెమ్యూనరేషన్ అందుకున్నారు అనేది టాక్. పవన్ రెమ్యూనరేషన్ తో కలిపి మొత్తంగా ఈ సినిమాకు 130 కోట్ల రూపాయలు ఖర్చయినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమాను 150 కోట్ల రూపాయలకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు అమ్మేశారని వార్తలు వస్తున్నాయి.

థియేట్రికల్ రైట్స్ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా పీపుల్స్ మీడియా వారికి విడుదలకు ముందే 150 కోట్ల రూపాయలు దక్కాయి. సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ అయి భారీ కలెక్షన్స్ నమోదు అయితే మరో 50 కోట్ల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

ఈ సినిమా లాభాల్లో వాటాను పవన్ కళ్యాణ్ అందుకోబోతున్నారు. లాభాల్లో దాదాపుగా 50% వాటాను పవన్ కళ్యాణ్ తీసుకుంటాడని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి సినిమా కు పెట్టిన పెట్టుబడికి వస్తున్న మొత్తానికి చాలా తేడా ఉంది అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అది లాభం అవ్వడం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారికి ఆనందాన్ని కలిగిస్తుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us