China: వ‌ధువుపై ఇంత ప్రేమ‌నా.. 60 కేజీల బంగారం బ‌హుక‌రించి వార్త‌ల్లోకి ఎక్కిన వ‌రుడు

China: ఈ మ‌ధ్య వివాహాల్లో త‌మ గొప్ప‌త‌నాన్ని చాటేందుకు తెగ ఆరాట‌ప‌డుతున్నారు. బాగా డ‌బ్బులు సంపాదించిన కుబేరులు త‌మ స్థోమ‌త‌కు త‌గ్గ‌ట్టు పెళ్లిళ్లు చేయ‌డ‌మే కాకుండా అంతే రేంజ్‌లో కానుక‌లు ఇస్తున్నారు. ఈ మ‌ధ్య ఆంధ్రాలో ఏ రేంజ్‌లో సారెలు పంచారో మ‌నం చూశాం. తాజాగా ఓ వధువుకు కాబోయే భర్త భారీ బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. కాబోయే భర్త ఇచ్చిన భారీ బంగారు ఆభరణాలను వధువు ధరించడం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Bride wears 60 kg gold gifted by husband on wedding
Bride wears 60 kg gold gifted by husband on wedding

ఇది జ‌రిగింది మ‌న దేశంలో కాదులేండి. చైనాలోని హుబే ప్రావిన్స్‌లో సంఘ‌ట‌న చేసుకోగా, అట్ట‌హాసంగా జ‌రిగిన వివాహ వేడుకలో మండపంలోనే కాబోయే భర్త వధువకు 60 కేజీల బంగారాన్ని బహుకరించాడు. సెప్టెంబ‌ర్ 30న జ‌రిగిన ఈ వివాహ వేడుక‌లో భారీ బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించిన వ‌ధువును బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు. 60 బంగారు నక్లెస్‌ల‌ను కానుకాగా అందించ‌గా, ఇది చూసి ఆశ్చ‌ర్య‌పోయారు.

వ‌ధువు తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ ధ‌రించి త‌న చేతిలో గులాబీలు ప‌ట్టుకుని ఒంటి నిండా న‌గ‌ల‌తో ఆమె అందంగా ముస్తాబైంది. వరుడు సంప‌న్న కుటుంబానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో వ‌ధువును బంగారు ఆభ‌ర‌ణాల్లో ముంచెత్తాడు. భారీ బంగారు ఆభరణాలతో క‌నిపించే వ‌ధువు ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి. ఇది చూసి అంద‌రు ముక్కున వేలేసుకుంటున్నారు.