Butta Bomma: బుట్ట‌బొమ్మలా కాబోయే పెళ్లికూతురు.. డ్యాన్స్ భ‌లే చేసింది..!

Butta Bomma సోష‌ల్ మీడియా వ‌ల‌న కొంద‌రు ఓవ‌ర్ నైట్ స్టార్స్‌గా మారుతున్నారు. కొద్ది రోజుల క్రితం సాయి శ్రీయ అనే వధువు పెళ్లి బరాత్‌లో .. ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని.. పాట‌కి స్టెప్పులేసి అల‌రించింది. వధువు పెళ్లి బరాత్‌లో చేసిన డ్యాన్స్‌తో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది.

TheNewsQube-

ఒరిజినల్ సాంగ్‌లో కొరియోగ్రఫీ కన్నా… పెళ్లి బరాత్‌లో వధువు చేసిన డ్యాన్సే ఆ పాటకు పర్ఫెక్ట్‌ అనే ఫీల్ కలిగించింది. సాయి శ్రీయ తన డ్యాన్స్‌కు చాలామంది ఫిదా అయిపోయారు. సామాన్యులు మొదలు పలువురు ప్రముఖులు సైతం సాయి శ్రీయ డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో కొనియాడారు.

ఇప్పుడు మ‌రి కొద్ది గంట‌ల‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న అమ్మాయి అచ్చం బుట్ట‌బొమ్మ‌గా మారి డ్యాన్స్ లు చేసింది. మొన్న‌టి వ‌ర‌కు పూజా హెగ్డేని అంద‌రు బుట్ట‌బొమ్మ అని అన్నారు. కాని ఈమెని చూస్తే అంద‌రికి ఈమెనే బుట్ట‌బొమ్మ అని అనాల‌నిపిస్తుంది. అంత అందంగా ఉంది.

తాజాగా కొత్త పెళ్లి కూతురు వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ వీడియో ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఫొటోషూట్‌ కోసం సంప్రదాయ దుస్తులతో ముస్తాబైంది వధువు. అదేవిధంగా ఒంటినిండా ఆభరణాలు ధరించింది. ఇక ఫొటోషూట్‌లో భాగంగా ఆమె చేసిన డ్యాన్స్‌ మరో హైలెట్‌.

ఎలాంటి బిడియం, మొహమాటం లేకుండా ఈ నూతన వధువు వేసిన స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి ఎంతో అద్భుతంగా ఉన్న ఈ వెడ్డింగ్‌ ఫొటోషూట్ వీడియోను మీరూ ఒకసారి చూసేయండి.