Breaking News థియేటర్స్ అప్పటి నుండి ఓపెన్ కానీ…
Admin - July 18, 2020 / 11:26 AM IST
కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో థియేటర్ లను మూసివేయడం జరిగింది. ఇది సినీ పరీశ్రమకు బారి నష్టాన్ని తెచ్చి పెట్టింది అనే చెప్ప్పుకోవాలి. అయితే ఇప్పుడు కరోనా మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుందో తగ్గుముఖం పడుతున్న ఆయా దేశాలలో థియేటర్లను ఓపెన్ చేయనున్నాయి అక్కడి ప్రభుత్వాలు.
ఇప్పటికే యూరప్ ఖండం లో కరోనా చాలా వరకు కంట్రోల్ అవ్వడం జరిగింది. దానితో అక్కడి థియేటర్ లు కూడా ఓపెన్ కావడం జరిగింది. ఇక అమెరికాలో కూడా జులై 17 నుండి థియేటర్ లను ఓపెన్ చేయాలన్న నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. కేవలం ఇవి మాత్రమే కాకుండా కరోనా పుట్టినిల్లు అయిన చైనా లో కూడా త్వరలో థియేటర్ లను ఓపెన్ చేయనున్నారు అంట. పూర్తి వివరాలలోకి వెళితే..
చైనా లో జనవరిలోనే అన్ని థియేటర్ లు మూతపడడం జరిగింది. దానితో మార్చిలో థియేటర్లను ఓపెన్ చేయాలన్న నిర్ణయం చైనా ప్రభుత్వం తీసుకున్నప్పటికీ అక్కడ పెరుగుతున్న కేసుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆలోచనని కాస్త విరమించుకుంది. అక్కడి ప్రభుత్వం అయితే ప్రస్తుత పరిస్థుతులలో చైనాలో చాలా వరకు కరోనా తగ్గుముఖం పట్టడం తో మరల థియేటర్ లకు అనుమతి ఇవ్వడం జరిగింది అంట. ఇక జులై 20 వ తేదీ నుండి అక్కడ థియేటర్ లు ఓపెన్ కానున్నాయి.