RGV పైన పవన్ కళ్యాణ్ భార్య పోలీస్ కేస్

Advertisement

రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వినగానే అందరికి గుర్తుకువచ్చేది. కాంట్రవర్సినే ఎప్పుడు ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తూ తనదైన శైలిలో ఏదో ఒక విధంగా ప్రేక్షకుల అటెంషన్ తనమీద ఉండేలా చేసుకుంటూ ఉంటాడు. ఈయన కొత్తగా రాసిన కథల కంటే వేరే వారి జీవితాలను ఆధారాంగా తీసుకొని రాసిన కథలే ఎక్కువ కనిపిస్తాయి.

అలా ఇప్పటికి చాలా సార్లు ఈయన ని కొంతమంది బెదిరించడం మరియు పోలీస్ స్టేషన్ లలో కేసులు పెడుతాం అని తేలియచేయడం వంటివి చేసినప్పటికీ అవేవి పట్టించుకోకుండా తాను అనుకుంది చేసుకుంటూ వెల్తూనే ఉన్నాడు. అలాగే అందరూ లాక్ డౌన్ సమయంలో అందరూ కాలిగా ఉన్నప్పటికీ వర్మ మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే లాక్ డౌన్ సమయంలో క్లైమాక్, నేకేడ్ సినిమాలను చేయడమే కాకుండా తన పర్సనల్ వెబ్ సైట్ లో విడుదల కూడా చేసేసాడు.

ఇక తాజాగా తన తదుపరి చిత్రం గురించి అనౌన్స్ చేయడం ఆ సినిమాకి సంబంధించిన స్టిల్స్ ని ఒక్కొక్కటిగా వదలడం చేస్తున్నాడు వర్మ. పవన్ కళ్యాణ్ యొక్క జీవిత కథ ఆయన ఎన్నికల తర్వాత ఎలా కొనసాగింది అన్న నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలుస్తుంది. పవర్ స్టార్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ జీవితంలో ఉండే అటువంటి పాత్రలనే తీసుకోవడం జరుగుతుంది.

ఇప్పటికే ఈ సినిమా పైన పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు . ఇక తాజాగా ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ భార్య అయిన అన్నా లెజినోవా వర్మ పైన కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతుంది అన్న సమాచారం అందుతుంది. అయితే ఇలా కేసు వేయడానికి ఈ సినిమాలోని కథ మరియు పాత్రలు అన్నీకూడా వ్యక్తిగత ఇమేజ్ ని అవమానించి దెబ్బతీసే విధంగానే ఉండడమే కారణం అన్నట్లు తెలుస్తుంది.

అయితే ఎన్ని పరిస్థితులు ఎదురు అయిన తాను అనుకుంది చేసుకుంటూ వెళ్లే రామ్ గోపాల్ వర్మ మరి ఈకేసు విషయాన్నీ ఎలా తీసుకొని ముందుకు వేళ్తాడో చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here