విశాఖలో మనిషి పుర్రె కలకలం

Advertisement

విశాఖ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. విశాఖ రెల్లి వీధిలో మనిషి పుర్రె కలకలం రేగింది. అయితే ఓ పాడు పడ్డ ఇంట్లో మనిషి పుర్రె ను చూసి స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ పుర్రెను ఓ వ్యక్తి కాల్చుతుండగా తాము చూశామని స్థానిక ప్రజలు చెపుతున్నారు. రాజు అనే వ్యక్తి పై స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కొంతకాలంగా చెడు అలవాట్లకు బానిసగా మారి సైకోగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు.

చుట్టుపక్కల వారి సమాచారంతో నిందితుడు రాజును పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే నిందితుడి పై గతంలో సస్పెక్ట్ షీట్‌ ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆ పుర్రెను స్మశానం నుంచి తెచ్చి ఉంటాడని భావిస్తున్నారు. అలాగే ఆ పుర్రెను కాల్చుకోవడం అవాస్తవం అని, తన తండ్రి మరణించిన తరువాత చెడు అలవాట్లకు బానిసైనట్టు ఆమె తల్లి తెలిపింది అని పోలీసులు స్పష్టం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here