Brahmanandam Son Raja Goutham Assets Value : బ్రహ్మానందం కొడుకు గౌతమ్ రోజుకు అంత సంపాదిస్తాడా.. స్టార్ హీరోలను మించిపోయాడు..!
NQ Staff - June 29, 2023 / 11:22 AM IST

Brahmanandam Son Raja Goutham Assets Value :
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి అందరికీ తెలుసు. ఆయన వారసుడిగా ఆయన పెద్ద కొడుకు గౌతమ్ కూడా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పల్లకిలో పెండ్లి కూతురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్నాడు. కానీ దాని తర్వాత చేసిన రెండు సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి.
దాంతో ఆయన సినిమాల్లో కనిపించడం మానేశాడు. ఆయనకు నటన కేవలం ఫ్యాషన్ మాత్రమే. కానీ ఆయన సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ చేసిన రాజా గౌతమ్ పలు ఎమ్ఎంసీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడట. ఈ వాటాల విలువ కొన్ని కోట్లు అని తెలుస్తోంది.
ఆయనకు బెంగుళూరులో కొన్ని రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. వీటన్నింటి ద్వారా ఆయనకు నెలకు రూ.30 కోట్ల ఆదాయం వస్తోందంట. అంటే రోజుకు రూ.కోటి సంపాదిస్తున్నాడన్నమాట. ఇంత పెద్ద మొత్తంలో స్టార్ హీరోలు కూడా సంపాదించట్లేదు. ఆయన ఈ స్థాయికి ఎదగడానికి కారణం బ్రహ్మానందమే.
బ్రహ్మానందం సినిమాల ద్వారా కోట్లు సంపాదించారు. ఆ డబ్బులను ఆయన వృథా చేయకుండా కాపాడాడు. వాటిని గౌతమ్ బిజినెస్ లోకి మళ్లించాడు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆస్తి వందల కోట్లలో ఉందని తెలుస్తోంది. స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా బ్రహ్మానందం ఆస్తులను సంపాదించాడు.