Brahmaji And RK Roja : పవన్‌ను చూస్తే అంత భయమెందుకు.. రోజాకు కౌంటర్ ఇచ్చిన బ్రహ్మాజీ..!
NQ Staff - January 20, 2023 / 01:42 PM IST

Brahmaji And RK Roja : పవన్ కల్యాణ్ మేనియా రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఆయనకు అన్ని వర్గాల నుంచి మద్దుతు బాగానే పెరుగుతోంది. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఆయనకు సపోర్టుగా మాట్లాడేందుకు ముందుకు వస్తున్నారు. గతంలో కమెడియన్ పృథ్వీ వైసీపీలో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆయన జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నాడు.
ఇక మొన్న కమెడియన్ హైపర్ ఆది శ్రీకాకుళం సభలో చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో చూశాం. మంత్రులను వరుస పెట్టి ఏకి పారేశాడు. అంతకు ముందు వైసీపీ నిర్వహించిన జగన్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తర్వాత జనసేన సభలో కనిపించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిపోయింది.
రోజా సీరియస్..
ఇక ఆదిని చాలామంది వైసీపీ నేతలు ఏకి పారేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి రోజా కూడా ఆదిపై సీరియస్ అయిపోయింది. వాళ్లవి చిన్న బతుకులు అని, ఏవో షోస్ చేసుకునే వారు అంటూ చెప్పింది. అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఆమె వ్యాఖ్యలపై నటుడు బ్రహ్మాజీ ఇన్ డైరెక్టుగా స్పందించాడు. ‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ క్యాంపైన్ చెయ్యమని కానీ పార్టీ లో చేరమని కానీ అడగలేదు చిన్న ఆర్టిస్ట్ లే కదా .. అంత భయపడతారెందుకు’ అంటూ ట్వీట్ చేశాడు. అంటే పవన్‌కల్యాణ్ అడగకపోయినా ఆయనకు సపోర్టు చేస్తారని.. చేస్తున్న వారిని చూసి భయమెందుకు అని ఇన్ డైరెక్టుగా రోజాకు కౌంటర్ వేశాడు.
నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ campain చెయ్యమని కానీ పార్టీ లో చేరమని కానీ అడగలేదు .
చిన్న ఆర్టిస్ట్ లే కదా .. అంత బయపడతారెందుకు .. https://t.co/9W0gU2uF98— Brahmaji (@actorbrahmaji) January 19, 2023