Boy Has 82 Teeth: ఆ కుర్రాడికి 82 దంతాలు.. చూస్తే హ‌డ‌లెత్తిపోతారు..!

Boy Has 82 Teeth: ప్రపంచంలో అనేక వింత‌లు మ‌న దృష్టికి వ‌స్తుంటాయి. వీటిని చూస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం. కొంద‌రికి రెండు చేతులు, మ‌రి కొంద‌రికి ఆరు వేళ్లు ,ఇంకొంద‌రికి ఉండాల్సిన దాని క‌న్నా ఎక్కువ పార్ట్స్ ఉండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటాం. తాజాగా 17 ఏళ్ల టీనేజ‌ర్‌కి 82 దంతాలు ఉన్నాయ‌నే విష‌యం వార్త‌ల‌లోకి ఎక్కింది. సాధార‌ణంగా ఎవ‌రికైన 32 దంతాలు ఉంటాయి. కాని ఆ కుర్రాడికి ఏకంగా 82 దంతాలు ఉన్నాయి. ఇది అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.

బీహార్‌లోని పాట్నాలో నివసిస్తున్న 17 ఏళ్ల టీనేజర్ నితీష్ కుమార్ అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. అంద‌రి మాదిరిగా కాకుండా అత‌నికి 82 దంతాలు ఉన్నాయ‌ట‌. అయితే ఇవి పుట్టుక‌తో వ‌చ్చిన‌వి కాదు. గత ఐదేళ్ల నుంచి కణితి తరహాలో పుట్టుకొచ్చాయి. ఈ దంతాల వల్ల నితీష్ నోరు మెదపడం కష్టంగా ఉండేది. గొంతు వద్ద తీవ్రమైన నొప్పితో బాధపడేవాడు. ఈ అరుదైన సమస్యను వైద్య పరిభాషలో ‘ఓడోంటోమా’ అంటారని డాక్టర్లు చెప్పారు.

82 teeth in jaw
82 teeth in jaw

పెరుగుతున్న దంతాలు నితీష్ ఆరోగ్యానికి చేటు క‌లిగించేలా క‌నిపిస్తున్నాయి. దంతాలు గొంతు వ‌ర‌కు వెళ్లి రెండు క‌ణ‌తులుగా ఏర్ప‌డ్డాయి. ఇన్నాళ్లు ఆర్ధిక స‌మ‌స్య‌ల‌తో అత‌ను చికిత్స కూడా చేయించుకోలేక‌పోయాడు. చివరికి ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్యులను సంప్రదించాడు. అతడి సమస్యను తెలుసుకుని వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ఎక్స్‌రేలో అతడి నోటి నుంచి గొంతు వరకు దంతాలే కనిపించాయి. అయితే, వాటిని తొలగించడం అంత సులభం కాలేదు.

వైద్యులు శ్ర‌మ‌కోర్చి దంతాలు తొల‌గించారు. అయితే నోటికి కింది భాగంలో దంతాల‌న్నీ ఉండ‌డంతో వాటిని తీయ‌డానికి మూడు గంట‌లు శ్ర‌మించారు. ఈ సందర్భంగా ఇనిస్టిట్యూట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మనీష్ మండల్ మాట్లాడుతూ.. ‘‘సరైన వైద్యం లభించకపోవడం వల్ల పరిస్థితి దయనీయంగా మారింది. మ్యాక్సిలోఫేషియల్ యూనిట్‌కు చెందిన డాక్టర్ ప్రియాంకర్ సింగ్, ఆమె సహచరుడు జావేద్ ఇక్బల్ సహకారంతో విజయవంతంగా ఆ దంతాల కణితిని తొలగించగలిగాం. ఇప్పుడు నితీష్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా నోటిని కదిలించగలడు’’ అని వారు పేర్కొన్నారు.