Cricket: ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ క్రికెట్ కెరీర్ చివరి బంతితో వికెట్ తీశారు అని మీకు తెలుసా..!!

Cricket : ప్రపంచం మొత్తం ఇప్పుడు క్రికెట్ అనే ఒక మతాన్ని అన్ని మతాల కంటే ఎక్కువగా నమ్ముతూ వస్తుంది.. అలాంటి క్రికెట్ లో ఆడి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఆటగాళ్ళు తమ కెరీర్ ని ఒక గొప్ప ఇన్నింగ్స్ తో ముగించాలని కోరుకుంటారు. కెరీర్ మొత్తం ఎన్నో వికెట్లతో, పరుగులతో అలరించిన వీరు చివరి ఇన్నింగ్స్ లో మంచిగా ఆడి తమకు కెరీర్ఎంతో ఘనంగా ముగించాలని కోరుకుంటారు.. అలా ప్రపంచ క్రికెట్ లో ఆడి తమ చివరి ఇన్నింగ్స్ లో, చివరి బంతికి వికెట్లు తీసిన బౌలర్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Bowlers who took wicket for their last ball: క్రికెట్
Bowlers who took wicket for their last ball

చివరి బంతికి వికెట్ తీసి రిటైర్ అయితే ఆ కిక్కే వేరు అన్నట్లు తాము ఆడేది చివరి మ్యాచ్ అని తెలిసి, వేసేది చివరి బంతి అని తెలిసి దాన్ని, వికెట్ గా మలుచుకున్నారు ఇద్దరు ఆటగాళ్ళు.. వారే శ్రీలంక శ్రీలంక స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్.. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్.. వారి వారి దేశాలకూ ఎన్నో గొప్ప గొప్ప విజయాలను అందించిన వీరు తమ చివరి మ్యాచ్లో చివరి బంతి కి వికెట్ తీసుకుని తమ కెరీర్ ని ఎంతో ఘనంగా ముగించారు..

ప్రపంచంలో అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన ఆటగాడు ముత్తయ్య మురళీధరన్.. శ్రీలంక తరఫున ఆడే ఈ ఆటగాడి బౌలింగ్ లో ఆడాలంటే ప్రతి బ్యాట్ మెన్ కి పెద్ద సవాల్ లాంటిదని చెప్పవచ్చు. టీం ఇండియాతో తన చివరి మ్యాచ్ ఆడిన ముత్తయ్య మురళీధరన్ తను వేసిన చివరి బంతితో టీమిండియా ఆటగాడైన ప్రజ్ఞాన్ ఓజా ఔట్ చేసి ఎంతో ఘనంగా రిటైర్ అయ్యాడు.. ఆస్ట్రేలియా ఆటగాడైన గ్లెన్ మెక్ గ్రాత్ తన చివరి వికెట్ ను జేమ్స్ అండర్సన్ నీ అవుట్ చేసి తీశాడు.. ఇంగ్లాండ్తో ఆయన ఆఖరి మ్యాచ్ ఆడగా అంతకు ముందు ఎన్నో మ్యాచ్ లు ఆస్ట్రేలియాకు వరించేలా చేశాడు.

Advertisement