Botsa Satyanarayana : ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న వివాదం
NQ Staff - April 12, 2023 / 10:17 PM IST
Botsa Satyanarayana : తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులపై మాట్లాడడం పట్ల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఏపీ గురించి హరీష్ రావు మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన రాష్ట్ర పరిస్థితులను చూసుకుంటే సరి పోతుందని పేర్కొన్నాడు.
రాజకీయం కోసమే హరీష్ రావు అలా మాట్లాడాడు అంటూ బొత్స అభిప్రాయం వ్యక్తం చేస్తాడు. తెలంగాణ మంత్రులు ఏపీ గురించి ఆలోచించకుండా వారి రాష్ట్రం గురించి చూసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుందని ఈ సందర్బంగా బొత్సా అన్నాడు.
ఇక చంద్రబాబు నాయుడు రాజకీయానికి కోసం విమర్శలు చేస్తున్నాడని.. ముందు ఆయన రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించాడో చెప్పాలని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు జీవితంలో ఇది పేటెంట్ అని చెప్పడానికి ఏమైనా ఉందా అని బొత్స ప్రశ్నించారు.
వైయస్సార్, జగన్ పేటెంట్ పథకాలు ఎన్నో ఉన్నాయని రాష్ట్రాన్ని సమర్ధవంతంగా పాలించిన ఘనత ఆయనకు ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలు ఇటీవల పదేపదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై విమర్శలు చేయడాన్ని బొత్స తీవ్రంగా తప్పుబట్టారు. ఒకరి రాష్ట్రంలోని పరిస్థితులు మరొకరి రాష్ట్రానికి తెలియని ఇక్కడి పరిపాలన గురించి ప్రజలను అడిగితే తెలుస్తుందని పేర్కొన్నాడు.