bopparaju : జగన్ vs నిమ్మగడ్డ కంటే హైలైట్ గా మారిన :: బొప్పరాజు vs వెంకటరామిరెడ్డి గొడవ ? 

employees union leaders bopparaju and venkata ramireddy war 
employees union leaders bopparaju and venkata ramireddy war 
bopparaju : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రతి చోట కూడా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ కోసం నిమ్మగడ్డ రమేష్ చేసిన న్యాయ పోరాటం గురించి చర్చ జరుగుతోంది. సీఎం జగన్ తో పోరాటం సాగించి మరీ నిమ్మగడ్డ రమేష్‌ ఎన్నికలను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా నిమ్మగడ్డను అభినందిస్తున్నారు. జగన్ తో నిమ్మగడ్డ పోరాటం చేసిన తీరు అద్బుతం అంటున్నారు. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు ఇద్దరు చేస్తున్న ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఉద్యోగ సంఘాల నాయకులు రెండుగా చీలి విమర్శలు చేసుకుంటున్నారు.
ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల ప్రకటన చేసిన సమయంలో ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. ఒక ఉద్యోగ సంఘం నాయకుడు ఎప్పుడు మాట్లాడని విధంగా మాట్లాడటంతో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకులను మించి ఉన్నాయి. ఎన్నికలు వెళ్తే ఉద్యోగుల ప్రాణాలకు హాని ఉంది. అలా మా ప్రాణాలకు హాని ఉందని తెలిస్తే అవతలి వాళ్ల ప్రాణాలు తీసేందుకు కూడా తాము సిద్దంగా ఉన్నాము అంటూ ఏకంగా నిమ్మగడ్డ రమేష్ ను హెచ్చరించాడు. ఇలా ఎన్నికల కమీషనర్‌ ను ఎదిరించడంతో పాటు సుప్రీం కోర్టుకు వెళ్లడంతో జాతీయ స్థాయిలో వెంకటరామిరెడ్డి చర్చనీయాంశం అయ్యాడు.
ఎంతో మంది ఉద్యోగులు కూడా వెంకట రామిరెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. అమరావతి ఉద్యోగ సంఘం నాయకుడు బొప్ప రాజు తీవ్రంగా స్పందించాడు. వెంకట రామిరెడ్డికి కింది స్థాయి ఉద్యోగులతో కనీస సంబంధాలు ఉండవు. ఆయన రాజకీయంగా వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. ఉద్యోగులకు ఆ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధః లేదని బొప్పరాజు అన్నారు. వీరిద్దరి మద్య గొడవ ప్రస్తుతం హాట్ టాపిక్‌ అయ్యింది. ఈ గొడవ కారణంగా ఏమైనా ఎన్నికలు ప్రభావితం అయ్యేనా అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు బొప్పరాజు ఇస్తున్న కౌంటర్‌ లు అదిరి పోయి వీరిద్దరు ఒక పొలిటికల్‌ వార్‌ కు తెర లేపారు.
Advertisement