బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ఆరుగురిని అరెస్ట్ చేసిన అధికారులు

Advertisement

బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి పై దర్యాప్తు చేస్తున్న అధికారులు డ్రగ్స్ కుంభకోణం బయటకు తీసింది. ఈ ఇప్పటికే ఈ కేసులో సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్న రియాను,రియా సోదరుడు సోవిక్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రియా, సోవిక్ తోపాటు మరో 8మందిని అధికారులు అరెస్ట్ చేశారు. అయితే అధికారులు ఇప్పుడు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు.

ఆదివారం ముంబయికి చెందిన కరమ్‌జీత్‌సింగ్‌ ఆనంద్‌, డ్వేన్ ఫెర్నాండెజ్, సంకేత్‌ పటేల్, అంకుష్ అన్రేజా, సందీప్ గుప్తా, అఫ్తాబ్ ఫతే అన్సారీని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఈ ఆరుగురు మాదకద్రవ్యాల సరఫరాలో భాగం పంచుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ కేసు బాలీవుడ్ లో ఇంకెంతమంది బయట పడతారో వేచి చూడాలి. సుశాంత్ మరణం మరణం ఇప్పటికే చాలా మంది సినీ తారలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఈ డ్రగ్స్ కేసులో ఇంకెంత మంది బయటకు వస్తారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here