టాలీవుడ్ లో బాలీవుడ్ బ్యూటీకి వరస అవకాశాలు ..?
Vedha - October 30, 2020 / 06:30 AM IST

భాష ఏదైనా.. హీరో ఎవరైనా సినిమాలో ఒక ఐటం సాంగ్ ఉంటే మాస్ ఆడియన్స్ కి వచ్చే కిక్కే వేరు. అంతేకాదు ఈ ఐటం సాంగ్ కి బాక్సాఫీస్ వద్ద ఒక లెక్క ఉంటుంది. కొన్ని చిన్న సినిమాలలో గనక స్టార్ హీరోయిన్ ఐటం సాంగ్ చేస్తే జరిగే బిజినెస్ లెక్క కూడా వేరే. ఈ ఐటం సాంగ్ లో హాట్ హాట్ గా అందాలు ఆరోస్తూ నర్తిస్తుంటే థియటర్స్ లో చప్పట్లు, విజిల్స్ మోత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక ప్రస్తుతం చిన్న సినిమా నుంచి రాజమౌళి తెరకెక్కించే భారీ బడ్జెట్ సినిమాల వరకు ఈ ఐటం సాంగ్ కోసం బాగానే ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా ప్రేక్షకులను థియోటర్స్ కి రప్పించడం కోసమే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదొక ట్రెండ్ గా సెట్ అయిపోయింది. సీనియర్ హీరోలైన మెగాస్టార్, బాలకృష్ణ లాంటి వాళ్ళ సినిమాలలోనూ ఈ ఐటం సాంగ్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది.
కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో పుష్ప కూడా ఒకటి. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఐటం సాంగ్ కోసమే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ని తీసుకు రావాలని అనుకున్నారన్న ప్రచారం జరిగింది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో చేసింది చాలా తక్కువ సినిమాలు. కాని ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సనమ్ రే, గ్రేట్ గ్రాడ్ మస్తీ, హేట్ స్టోరీ 4, పాగల్ పంటి అన్న సినిమాలు చేసి స్టార్ డం ని సంపాదించుకుంది.
ఇక దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో రూపొందుతున్న బ్లాక్ రోజ్ అన్న సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రొమాంటిక్, థిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఐటం సాంగ్ కోసం తీసుకు రావాలనుకున్న ఊర్వశీ రౌతెలా కి టాలీవుడ్ లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు. అయితే తను తెలుగులో చేసే సినిమా బాలీవుడ్ లో కూడా రీమేక్ కావలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.