కేటీఆర్ ను సీఎం చేయాలి బోధన్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Advertisement

నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి మంత్రి, ఎమ్మెల్యే తమ నియోజకవర్గ పరిధిలో జెండా ఆవిష్కరించాలి అని సీఎం కెసిఆర్ పిలుపునిచ్చాడు. దీనితో అందరు ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే నిజామాబాద్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ జెండా ఎగురవేసిన అనంతరం సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ.. యువ నాయకులు, డైనమిక్ లీడర్ కేటీఆర్‌ను సీఎంను చేయాలని షకిల్ కోరారు. ఒక సీఎంకు కావాల్సిన అన్ని అర్హతలు కేటీఆర్‌కు ఉన్నాయని అన్నాడు. సీఎం కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా అని దయచేసి కేటీఆర్‌ను తెలంగాణ సీఎంగా చేయాలని వ్యాఖ్యానించారు. ఇక షకిల్ వ్యాఖ్యలపై జిల్లా టీఆర్ఎస్‌లో జోరుగా చర్చ జరుగుతుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here