Blakrishna : నన్ను అలా అంటున్న వారికి దబిడి దిబిడే.. వారికి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..!
NQ Staff - January 27, 2023 / 12:23 PM IST

Blakrishna : బాలకృష్ణ పేరు ఈ నడుమ వార్తల్లో బాగా నిలుస్తోంది. ముఖ్యంగా వివాదాల్లో ఎక్కువగా ఉంటుంది. ఆయన రీసెంట్ గా వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ రంగారావు ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అంటూ మాట్లాడాడు. అయితే ఏఎన్నార్‌ను బాలయ్య అవమానించాడు అంటూ అక్కినేని ఫ్యామిలీ గరం అవుతుంది.
అంతే కాకుండా బాలయ్య మీద అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ నిరసనలు కూడా తెలిపింది. ఈ క్రమంలోనే బాలయ్య కూడా ట్విట్టర్ వేదికగా ఈ వివాదం మీద స్పందించాడు. తాను ఏఎన్నార్‌ను బాబాయ్ అని పిలుస్తానని, తాను ఎలాంటి తప్పుడు కామెంట్లు చేయలేదంటూ తెలిపాడు. అంతే కాకుండా పొగడ్తలకు దూరంగా ఉండటం ఆయన నుంచే నేర్చుకున్నాను అంటూ తెలిపాడు.
తప్పుడు కామెంట్లు చేయలేదు..
అయితే నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడాడు. నాకు ఏఎన్నార్ అంటే చాలా అభిమానం. ఆయన్ను తాను ఎలాంటి తప్పుడు కామెంట్లు చేయలేదని తెలిపాడు. అంతే కాకుండా తనకు 60 ఏండ్లు అని ఎవరైనా అంటే వారికి దబిడి దిబిడే అంటూ వార్నింగ్ ఇచ్చాడు బాలయ్య.
కాగా బాలయ్య మీద ఈ నడుమ ఏజ్ పరమైన కామెంట్లు బాగా వస్తున్నాయి. చిరంజీవి కన్నా పెద్దవాడిలా కనిపిస్తున్నాడు అంటూ కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని చెబుతున్నారు నందమూరి అభిమానులు.