Bharosa Yatra : ప్రజాగోస – బీజేపీ భరోసా యాత్ర: నవంబర్ 26 నుంచి డిసెంబర్ 14 వరకు.!

NQ Staff - November 22, 2022 / 07:35 PM IST

Bharosa Yatra : ప్రజాగోస – బీజేపీ భరోసా యాత్ర: నవంబర్ 26 నుంచి డిసెంబర్ 14 వరకు.!

Bharosa Yatra : భారతీయ జనతా పార్టీ ఈ నెల 26 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకూ ‘ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర’ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ కార్యక్రమం చేపట్టనుంది. ఒక్కో పార్లమెంటు పరిధిలోని ఒకటి లేదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు.

ఈ మేరకు ప్రజా గోస – బీజేపీ బరోసా యాత్ర ఇన్‌ఛార్జి కాసం వెంటకేశ్వర్లు సంబంధిత వివరాల్ని వెల్లడించారు. మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల్, నాగర్ కర్నూలు, జడ్చర్ల, సాద్ నగర్, చేవెళ్ళ, పరిగి, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, పరకాల, వర్ధన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలను నిర్వహించనున్నారు.

200 బైక్‌లతో 10 నుంచి 15 రోజులపాటు బైక్ ర్యాలీలు

స్థానిక సంస్థలపై ప్రతి గ్రామంలోనూ కార్నర్ మీటింగులు నిర్వహిస్తారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఆ నియోజకవర్గ వ్యాప్తంగా 200 బైకులతో 10 నుంచి 15 రోజులపాటు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు బీజేపీ వెల్లడించింది.

బీజేపీని బలోపేతం చేయడం అదే సమయంలో అధికార పార్టీ పాలనా వైఫల్యాల్ని ఎండగట్టడం ఈ యాత్ర లక్ష్యమని బీజేపీ చెబుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడి గెలిచామంటున్న బీజేపీ, తెలంగాణలో టీఆర్ఎస్‌కి కాలం చెల్లిందని అంటోంది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామనీ, అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us