BJP-TRS : కేసీఆర్, కేటీఆర్ లకి.. తెలంగాణ బీజేపీ ధన్యవాదాలు..

BJP-TRS : తెల్లారితే శనివారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనుండగా ఈరోజు శుక్రవారం రాత్రి తెలంగాణ బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపటం ఏంటి అనుకుంటున్నారా?. ఇది నిజమే. ఫేక్ న్యూస్ కాదు. గులాబీ పార్టీని గుండెలకు హత్తుకొని మెచ్చుకోవాల్సిన వార్త. రాజకీయం అంటే పరస్పరం తిట్టుకోవటం కాదు. సున్నితాంశాల్లో సరైన, సానుకూల నిర్ణయం తీసుకోవటం కూడా అని కారు పార్టీ నిరూపించింది. కమలం పార్టీ రిక్వెస్టును అంగీకరించింది. దాదాపు ఏడాది కాలంగా తెలంగాణ బీజేపీకి, అధికార పార్టీ టీఆర్ఎస్ కి మధ్య ఇలాంటి చక్కని సన్నివేశాన్ని మనం చూడలేదు. అలాంటిది ఇవాళ జరిగింది. దుబ్బాకలో, నాగార్జునసాగర్ లో, అంతకు ముందు కూడా ఇలాంటి సందర్భాలు చోటుచేసుకొని ఉండాల్సింది. బ్యాడ్ లక్. అనవసరంగా ఆవేశాలకు పోయారు.

BJP-TRS : bjp request.. trs accepted..
BJP-TRS : bjp request.. trs accepted..

లింగోజిగూడలో..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి బీజేపీ తరఫున గెలిచిన ఆకుల రమేష్ గౌడ్ కనీసం కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే 2020 డిసెంబర్ చివరి వారంలో కన్నుమూశారు. అది అప్పట్లో చాలా మందిని బాధించింది. ఇప్పుడు ఆ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ మేరకు నిన్న గురువారం ప్రకటన కూడా వచ్చింది. బై ఎలక్షన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఉత్తమ్ కి కేటీఆర్ ఫోన్: BJP-TRS

ఆకుల రమేష్ గౌడ్ కుమారుడు కాషాయం పార్టీ తరఫున ఈ ఉపఎన్నికలో బరిలో నిలుస్తుండటంతో ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కోపరేట్ చేయాలని ఆ పార్టీ టీఆర్ఎస్ ని కోరింది. ఈ మేరకు బీజేపీలో ‘రైట్ పర్సన్’గా పేరొందిన మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు నాయకత్వంలో ఎల్బీనగర్ శాసన సభ్యుడు సుధీర్ రెడ్డి, ఆకుల రమేష్ సతీమణి, కొడుకు, ఇరు పార్టీల నేతలు ఈరోజు శుక్రవారం రాత్రి ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిశారు. ఆయన తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ని అడగ్గా సరే అన్నారు. అంటే లింగోజిగూడ బైఎలక్షన్ లో టీఆర్ఎస్ పోటీలో ఉండదు. మానవతా దృక్పథంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నందుకు టీఆర్ఎస్ నాయకత్వానికి బీజేపీ నేతలు, ఆకుల రమేష్ కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ కూడా లింగోజిగూడలో పోటీకి దూరంగా ఉండాలని రిక్వెస్ట్ చేయటం విశేషం.

Advertisement