BRS Party : బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ.. కేసీఆర్ బలం ఏంటో బయటపడుతోందా..?

NQ Staff - January 21, 2024 / 11:27 AM IST

BRS Party : బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ.. కేసీఆర్ బలం ఏంటో బయటపడుతోందా..?

BRS Party  :

మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి బీఆర్ ఎస్ ను టార్గెట్ చేశాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ అంటే బద్ద శత్రువు పార్టీలు. ఇలాంటి పార్టీలు కూడా రెండు కలిసి బీఆర్ ఎస్ ను టార్గెట్ చేశాయంటే ఆ రెండు పార్టీల విధానాలు ఏంటో అర్థం అవుతుందని కేటీఆర్ చాలా సార్లు విమర్శలు గుప్పించారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఆ సమయంలో కూడా బీజేపీల తలలు పండిన నేతలుగా చెప్పుకునే కొందరు ఓడిపోయినా సరే.. తమకు పెద్దగా బాధ లేదని.. బీఆర్ఎస్ ఓడిపోవడం తమకు నచ్చిందని చెప్పుకొచ్చారు.

ఇక ఓటమి పాఠాల నుంచి పొరపాట్లు తెలుసుకున్న బీఆర్ ఎస్ అన్ని పార్టీల కంటే ముందే ఎంపీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఎలాగైనా ఈ సారి మెజార్టీ సీట్లు గెలచుకుని తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆరాట పడుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ నేతలు మళ్లీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు అందరికీ విడ్డూరంగా అనిపిస్తోంది. ఎందుకంటే బీఆర్ ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ ను విమర్శించాలి, కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలి. అంతే గానీ బీజేపీ అనూహ్యంగా బీఆర్ఎస్ నే ఇంకా టార్గెట్ చేస్తోంది.

మొన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికల్లో ఓటు వేస్తు మూసీ నదిలో వేసినట్టే అని చెప్పారు. అటు నుంచి బండి సంజయ్, ఇటు నుంచి రఘునందన్ రావు కూడా ఇదే కామెంట్లు చేశారు. బీఆర్ఎస్ కు ఓటేయొద్దని చెప్పుకొచ్చారు. అంతే గానీ ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన రావట్లేదు. అసలు కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ పోటీగా లేదు కాంగ్రెస్ పోటీగా ఉంది. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీల నడుమ పీఎం పదవి కోసం పోరాటం జరుగుతోంది. అలాంటి సమయంలో బీజేపీ కాంగ్రెస్ ను విమర్శించాలి గానీ బీఆర్ఎస్ ను విమర్శించడం ఏంటిన కొందరు అడుగుతున్నారు.

అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా సరే ఆ పార్టీ బలం ఇంచుకూడా తగ్గలేదని బీజేపీ అభిప్రాయ పడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ నాయకత్వం బలంగా ఉంది. పైగా ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి వారందరూ ఎంపీ ఎన్నికలపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెడుతారని బీజేపీ భావిస్తోంది.

అలాంటప్పుడు కచ్చితంగా తమకు కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ నుంచే ఎక్కువ పోటీ వస్తుందని బీజేపీ భావిస్తోంది. పైగా కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే ఎలాంటి వ్యూహాలు రచిస్తారో బీజేపీ నేతలకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు కేసీఆర్ బలాన్ని అంచనా వేసి ముందే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు. తమ కేసీఆర్ బలం అంటే ఇదీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us