Telangana : ఆత్మగౌరవాన్ని మంట కలిపేస్తున్న బీజేపీ.. ఈటల రాజేందర్ ఏమంటాడో..?

NQ Staff - November 11, 2023 / 01:48 PM IST

Telangana : ఆత్మగౌరవాన్ని మంట కలిపేస్తున్న బీజేపీ.. ఈటల రాజేందర్ ఏమంటాడో..?

Telangana :

బీజేపీ అంటే బండి సంజయ్ కు ముందు బండి సంజయ్ హయాంలో అన్నట్టు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బండి సంజయ్ కారణంగా ఎక్కడో పాతాళంలో ఉన్న ఆ పార్టీకి తిరుగులేని గ్రాఫ్‌ వచ్చింది. దాన్ని ఎవరూ కాదనలేరు. బండి సంజయ్ చాకచక్యంతో అడ్రస్ లేని పార్టికి పర్మినెంట్ అడ్రస్ క్రియేట్ చేశారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇప్పుడు బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత ఆయన పెద్దగా బయట కనిపించట్లేదు. దాంతో బీజేపీ గ్రాఫ్‌ సడెన్ గా పడిపోయింది.

అయితే ఇప్పుడు ఒక జాతీయ పార్టీ అయి ఉండి, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ.. ఎలాంటి గుర్తింపు లేని జనసేనతో పొత్తులు పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది. పైగా జనసేన 32 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మన్ వెళ్లి జనసేనతో పొత్తులు పెట్టుకున్నారు. ఇదే ఇప్పుడు బీజేజేపీ గ్రాఫ్‌ ను మరింత దిగజార్చుతోంది. ఎందుకంటే ఆత్మగౌరవం అంటూ నిత్యం చెప్పుకుంటుంది బీజేపీ పార్టీ. ఒకరితో తమకు పొత్తులు వద్దని చెబుతుంది. పైగా ఎవరి పెత్తనాలు వద్దని తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందో.. ఆ విషయాన్ని వారు మర్చిపోతున్నారు.

ఒకప్పుడు ఆత్మగౌరవం అనే పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని అసెంబ్లీలో వినిపించారు ఈటల రాజేందర్. అప్పట్లో కిరణ్‌ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈటల రాజేందర్ ను, తెలంగాణను దారుణంగా అవమానించాడు. అలాంటిది ఇప్పుడు అదే ఆంధ్రా పార్టీ అయిన జనసేనతో పొత్తులు పెట్టుకోవడం ఏంటని బీజేపీని విమర్శిస్తున్నారు. పైగా ఒక జాతీయ పార్టీగా ఉండి.. తెలంగాణలో కనీసం గుర్తింపు లేని జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో మాత్రం అర్థం కావట్లేదు. అంతే కాకుండా ఎవరైతే తెలంగాణను అవమానించారో అదే కిరణ్‌ కుమార్ రెడ్డిని ఇప్పుడు బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో సలహాలు ఇచ్చేందుకు పురమాయించుకున్నారు.

ఇదే విషయాన్ని ఇప్పుడు బీఆర్ ఎస్ పార్టీ ఎత్తి చూపిస్తోంది. తెలంగాణను అవమానించిన ఆంధ్రా నేతలతో కొమ్ముకాయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడమే అంటున్నారు. ఇదే విషయంపై ఈటలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఆత్మగౌరవం అంటూ బీఆర్ ఎస్ నుంచి వెళ్లిపోయిన ఈటల.. ఇప్పుడు ఎందుకు ఆ మాట మర్చిపోయారని అంటున్నారు.

ఆనాడు తెలంగాణను అవమానించిన కిరణ్‌ కుమార్ రెడ్డిని ఎందుకు సలహాదారుడిగా పెట్టుకున్నారంటూ మండిపడుతున్నారు. ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు బీజేపీ నుంచి గానీ.. ఈటల రాజేందర్ నుంచి గానీ ఎలాంటి సమాధానాలు రాలేదు. ఒక విధంగా బీజేపీకి, జనసేన, కిరణ్ కుమార్ రెడ్డితో నష్టమే తప్ప లాభం లేదు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us