BJP Party : పేరుకే బీసీ నినాదం అంటున్న బీజేపీ.. చేతల్లో మాత్రం లేదే..?

NQ Staff - November 12, 2023 / 12:51 PM IST

BJP Party : పేరుకే బీసీ నినాదం అంటున్న బీజేపీ.. చేతల్లో మాత్రం లేదే..?

BJP Party :

బీజేపీ ఈ ఎన్నికల్లో ఓ నినాదాన్ని ఎత్తుకుంది. బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల్లో బీసీలకు అన్యాయం జరిగిందని.. బీసీలకు టికెట్లు కేటాయించలేదంటూ ఆరోపణలు గుప్పించిన బీజేపీ పార్టీ.. చివరకు బీసీ నినాదంతో ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లనున్నట్టు తెలిపింది. అంతే కాకుండా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీతో కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకుంటున్నట్టు ప్రచారం చేయించింది. బీసీలకే అధిక టికెట్లు ఇస్తామని ప్రకటించింది. కానీ తీరా చూస్తే చాలా కీలక మైన నియోజకవర్గాల్లో అసలు బీసీలను పక్కన పెట్టేసింది. ఇందుకు బెస్ట్ ఉదాహరణ వేములవాడ నియోజకవర్గం.

వేములవాడలో మొదటి నుంచి తుల ఉమకు టికెట్ ఇస్తామని ప్రకటించారు. ఆమెకు ఈటల రాజేందర్ ఫాలోవర్ గా మంచి పేరుంది. ఈటల రాజేందర్ బీఆర్ ఎస్ లో ఉన్నప్పుడు ఆమె జడ్పీ చైర్ పర్సన్ గా కూడా చేశారు. ఈటల పార్టీ మారినప్పుడు ఆమె కూడా బీజేపీలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఈటల వెంటే ఉన్నారు. తనకు వేములవాడ టికెట్ ఇస్తామని ప్రకటించడంతో ఆమె మురిసిపోయారు. కానీ బీఫామ్ ఇచ్చినట్టే ఇచ్చి చివరకు తీసేసుకున్నారు. దాంతో ఆమె చాలా బాధపడిపోయారు. పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఆమె మాత్రమే కాదు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మునుగోడు, నల్గొండ, సిరిసిల్ల లాంటి కీలక నియోజకవర్గాల్లో కూడా బీసీలకు టికెట్లు ఇవ్వలేదు. సిరిసిల్లలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ కు టికెట్ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ చివరకు రాణి రుద్రమా రెడ్డికి టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో లగిశెట్టి పార్టీకి రాజీనామా చేశారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అగ్ర వర్ణాటకు టికెట్లు కేటాయించింది బీజేపీ పార్టీ. దాంతో చాలామంది బీసీ నేతలు ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు.

BJP Party Announced Will Give More Tickets BC

BJP Party Announced Will Give More Tickets BC

ఇదే ఇప్పుడు బీజేపీకి వరుస షాక్ లు ఇస్తోంది. బీజేపీ పార్టీ అంటే బీసీల పార్టీ కాదు అని తేలిపోతోందని బీఆర్ ఎస్, కాంగ్రెస్ లు బలంగా ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఒక నినాదం ఎత్తుకున్నప్పుడు ఎన్నికల్లో దాన్నే ఫాలో కావాలి. అంతే గానీ ఆ నినాదాన్ని పక్కన పెట్టేస్తే మాత్రం ప్రజలు అస్సలు నమ్మరు.

ప్రతిపక్షాలు కూడా దాన్ని రాజకీయం చేసేందుకు కాచుకుని కూర్చుంటాయి. ఈ విషయాలు తెలిసి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది బీజేపీ పార్టీ. దాంతో ఇప్పుడు ఆ పార్టీని ప్రజలు అస్సలు నమ్మట్లేదని అంటున్నాయి కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు. ఇది బీజేపీ చేతులారా చేసుకున్న పొరపాటే.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us