సుశాంత్ మరణంకు, ఠాక్రే కుటుంబానికి సంబంధం ఉంది: బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే

Advertisement

ముంబై: హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మరణం రోజుకో మలుపు తిరుగుతుంది. రకరకాల కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే చేసినఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. సుశాంత్ మరణంకు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడైన ఆదిత్య ఠాక్రేకు సంబంధం ఉందని నారాయణ్ వ్యాఖ్యానించారు. జూన్ 13న సూరజ్ పంచోలి ఇంట్లో జరిగిన పార్టీకి ఆదిత్య ఠాక్రే, సుశాంత్ మేనేజర్ దిశా కూడా వచ్చారని రాణే తెలిపారు.

అయితే ఈ విషయంపై స్పందించిన సూరజ్ పంచోలి…జూన్ 13న తన ఇంట్లో ఎలాంటి పార్టీ జరగలేదని, పార్టీ జరిగినట్టు ఆధారాలు ఉంటే రాణే చూపించాలని డిమాండ్ చేశారు. తనను ఇలా మానసికంగా హింసించవద్దని కోరారు. సుశాంత్ మరణంపై ఠాక్రే కుటుంబానికి సంబంధం ఉండటం వల్లే ముంబై పోలీసులు ఈ కేసుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని నారాయణ్ వెల్లడించారు. సుశాంత్ కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని నారాయణ్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here