సుశాంత్ కు విషం ఇచ్చి చంపేశారు : బీజేపీ ఎంపీ స్వామి

Advertisement

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న ముంబైలోని తన ఇంట్లో అనుమానాదాస్పద స్థితిలో మరణించారు. ఇక తన మరణం వెనుకాల చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చాలా మంది తనది ఆత్మహత్య అని అనుకున్నారు. అయితే తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేసాడు. సుశాంత్ సింగ్ ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని ఆరోపించాడు. అలాగే సుశాంత్ కు విషం ఇచ్చారని అన్నాడు.

ఇక ఈ విషయం బయటకు రాకుండా పోస్టు మార్టం ఆలస్యంగా నిర్వహించారని వెల్లడించాడు. ‘సుశాంత్ ను హత్య చేసిన హంతకుల కఠిన స్వభావం నెమ్మదిగా బయటకు వస్తోంది. ఎస్‌ఎస్‌ఆర్‌ జీర్ణాశయంలో ప్రయోగించిన విషం ఆనవాళ్లు తెలియకుండా పోవాలనే ఉద్దేశంతోనే పోస్ట్ మార్టం ఆలస్యం చేశారని అన్నాడు. అలాగే ఈ ఘటనకు కారణమైన దుండగులు అందరిని శిక్షించాలి అని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here