BJP MLA Raja Singh : తెలంగాణలోను కరోనా టెర్రర్.. బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్‌కి పాజిటివ్
NQ Staff - June 21, 2022 / 12:38 PM IST

BJP MLA Raja Singh : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. రోజు దేశ వ్యాప్తంగా పదివేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో అయిన రెండు వందలకు పైగానే కేసులు నమోదు అవుతున్నారు. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్ కరోనా బారిన పడ్డారు.
కరోనా కలకలం..
రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో అనుమానంతో సోమవారం పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. అంతకుముందు ఆయన బేగంబజార్ డివిజన్లోని సిసి రోడ్డు, స్టోమ్ వాటర్ పైప్ లైన్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన సన్నిహితులు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, జూన్ 17న రాజాసింగ్ హీరోయిన్ సాయి పల్లవిపై విరుచుకుపడ్డారు. విరాటపర్వం మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా సాయిపల్లవి గోసంరక్షకుల దాడులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. కశ్మీర్ ఫైల్స్ పై సాయి పల్లవి చేసిన కామెంట్ సర్వత్రా కాక రేపాయి.

BJP MLA Raja Singh Corona Positive
ఈ క్రమంలో సాయిపల్లవిపై గో సంరక్షకులు, బజరంగ్ దళ్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని, జనం తిరగబడి కొడతారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. సినిమా కోసం కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయి పల్లవి మైండ్ పాడైందని రాజా సింగ్ పేర్కొన్నారు.
కాశ్మీర్ వెళ్లి అక్కడి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయి. కాశ్మీర్‌పై వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదు. ఆవును తల్లిగా కొలుస్తాం. ఆవును కాపాడుకున్నామనే సంతోషంలో నినాదాలు ఇస్తాం. ఒక్క నటుడ్ని అరెస్టు చేస్తే హిందువుల జోలికి ఎవరూ రారు. నటులు, దర్శకులకు ఇస్లాంపై కామెంట్స్ చేసే ధైర్యం ఉందా? ఇప్పుడున్న హిందువులు శివాజీలాంటి వాళ్లు. హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే భౌతిక దాడులు జరుగుతాయి’’ అని రాజా సింగ్ అన్నారు.