Konda Vishweshwar Reddy : కవిత అరెస్ట్ కాకపోవడం వల్లే బీజేపీ ఉధృతికి బ్రేకులు
NQ Staff - May 19, 2023 / 07:04 PM IST

Konda Vishweshwar Reddy : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉధృతికి బ్రేకులు పడ్డాయి అంటూ స్వయంగా ఆ పార్టీ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నాయకత్వం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ఆమె అరెస్ట్ కాకపోవడంతో అంతా కూడా బీజేపీ మరియు బీఆర్‌ఎస్ కి మధ్య ఏదో అవగాహణ ఒప్పందం ఉందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆ అనుమానం వల్ల తెలంగాణ లో బీజేపీ ఉధృతికి బ్రేకులు పడ్డాయి అన్నట్లుగా ఆయన విశ్లేషించారు. కవిత అరెస్ట్ అయ్యి ఉంటే కచ్చితంగా తెలంగాణ లో బీజేపీ యొక్క జోరు మరింత పెరిగి ఉండేది… చేరికలు కూడా మరింతగా పెరిగి ఉండేది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మరియు కార్యకర్తల యొక్క అభిప్రాయం ఏంటి అనేది చూడాలి. ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.