MP Dharmapuri Arvind : టీ బీజేపీలో మెల్లగా రాజుకుంటున్న వివాదం
NQ Staff - March 13, 2023 / 09:08 PM IST

MP Dharmapuri Arvind : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనంటూ ప్రకటించుకున్న బిజెపి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మరి ప్రచారం నిర్వహించాలనుకుంటుంది.
ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మాదిరిగా బిజెపి నాయకులు కూడా కుమ్ములాడుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కవితపై పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.
ఆ వ్యాఖ్యలను బిజెపికి చెందిన కొందరు నాయకులు ఖండిస్తున్నారు. అవి పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలు కావంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు. బండి సంజయ్ వెంటనే ఆ వ్యాఖ్యలను తన వ్యక్తిగత వ్యాఖ్యలుగా ప్రకటించు కోవాలంటూ ఎంపీ అరవింద్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

BJP Leaders Criticized MP Dharmapuri Arvind Comments
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను పలువురు బిజెపి నాయకులు తప్పుపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను ఖండించారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తానికి బిజెపిలో కుమ్ములాట క్లియర్ గా కనిపిస్తుంది.