అయోధ్య భూమిపూజను లైవ్ ప్రసారం చేయని ఎస్వీబీసీ ఛానెల్,ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

Advertisement

అమరావతి: హిందు మత విలువలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడటానికి ఏర్పడిన ఎస్వీబీసీ ఛానెల్ అయోధ్య రామ మందిర భూమి పూజను ఎందుకు లైవ్ ప్రసారం చేయలేదని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసారం చేయకపోవడానికి గల కారణాలను ప్రభుత్వం, ఎస్వీబీసీ పెద్దలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

ప్రపంచం మొత్తం 250 చానెల్స్ లలో లైవ్ ను ప్రసారం చేస్తే ఎస్వీబీసీ ఛానల్ మాత్రం భాధ్యతారహితంగా వ్యవహరించిందని, ప్రసారం చేయకుడిన హిందువుల మనోభావలను గాయపరిచిందని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్య మతాలకు ఇచ్చే ప్రాధాన్యత హిందూ మతానికి సీఎం జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదని బీజేపీ నాయకులు లంక దినకర్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఉన్న హిందువులందరు గర్వంగా చెప్పుకునే ఘట్టంను ప్రసారం చేయకుండా ఉండటానికి గల కారణాలను ఎస్వీబీసీ పెద్దలు చెప్పాలని బీజేపీ నాయకులు చెప్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here