జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించిన జేపీ నడ్డా

Advertisement

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలలో బీజేపీ నాయకులు పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రజల కష్టాలను తెలుసుకొని వాటి కోసం పొరడడంలో ముందుండాలని పార్టీ నేతలకు జేపీ సూచనలు చేశారు. పార్టీ కార్యాలయాలను కార్యకర్తలు వినియోగించుకోవాలని నడ్డా వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జేపీ రాష్ట్రంలో కరోనాపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం కుంభ కర్ణుడిలా నిద్రపోతుందని మండిపడ్డారు. తెరాస నాయకులు కరోనా విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, కనీసం టెస్టులను కూడా పెంచడం లేదని వ్యాఖ్యానించారు. కరోనా మృత దేహాలను సరిగ్గా దహనం చేయలేని దయనీయంగా స్థితిలో తెరాస ప్రభుత్వం ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలు బీజేపీకి అధికారం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here