BJP Efforts On Telugu States : తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్
NQ Staff - July 7, 2023 / 07:00 PM IST

BJP Efforts On Telugu States :
కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీ దేశంలోనే ఎన్నో రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకోవడంలో సఫలం అయింది.. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బిజెపి ఏమాత్రం ప్రభావం చూపించలేక పోతోంది. ముఖ్యంగా ఏపీలో రోజు రోజుకీ బీజేపీ పరిస్థితి దయనీయంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెలంగాణలో పార్టీ ఉవ్వెత్తిన ఎగసిపడింది. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ అంతలోనే బీజేపీ చల్లారిందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మళ్ళీ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లి మరో ఆరు నెలల్లో జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని.. కింగ్ కాకున్నా, కింగ్ మేకర్ అవ్వాలనే పట్టుదలతో బిజెపి నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.
అందులో భాగంగానే ఎన్నికల ఇన్చార్జ్ లను నియమించింది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన ప్రకాష్ జవదేకర్ ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ గా నియమించినట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

BJP Efforts On Telugu States
మొత్తానికి బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా మారెందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నం చేస్తుంది. ఇక అధికార బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా తమ వ్యూహాల్లో ఉంది. మరి ఈ రాజకీయ ట్రయాంగిల్ పోటీలో ఎవరు గెలుస్తారనేది చూడాలి.