BJP : జనసేనాని పవన్ కళ్యాణ్‌ని లైట్ తీసుకున్న ప్రధాని మోడీ.?
NQ Staff - December 6, 2022 / 06:58 PM IST

BJP : కొద్ది రోజుల క్రితమే విశాఖ పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. అయితే, ఆ భేటీలో ఏం జరిగిందన్నదానిపై పూర్తి స్పష్టత రాలేదు. ప్రధానితో భేటీ తర్వాత కొత్త ఉత్సాహంతో కన్పించాల్సిన జనసేనాని, ఇకొంత డీలాపడినట్లు కనిపించిన సంగతి తెలిసిందే.
అయితే, అనూహ్యంగా ప్రధాని మోడీ నేడు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలతో ఫోన్లో మాట్లాడారు. అంటే, జనసేన పార్టీని లైట్ తీసుకుని, వైఎస్సార్టీపీ వైపు బీజేపీ చూపు షురూ అయ్యిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్టీపీ తోనే ప్రయోజన మెక్కువ..
ప్రధాని మోడీ ఎవరితోనైనా మాట్లాడొచ్చు.. రాజకీయాల్లో శాశ్వత శతృత్వం శాశ్వత మితృత్వం వుండవు.. ఏమో, ప్రధాని మోడీ ఆలోచనలు ఎలా వున్నాయో.. అంటూ బీజేపీ నేతలు అత్యంత వ్యూహాత్మకంగా స్పందిస్తున్నారు షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేయడంపై.
షర్మిల పార్టీతో సన్నిహితంగా వుంటే, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి లాభమనీ, జనసేన వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని బీజేపీకి ఓ నివేదిక కూడా ఇప్పటికే బీజేపీకి అందిందంటూ మీడియాకి లీకులు వస్తున్నాయి. అయితే, ఈ విషయమై పెదవి విప్పేందుకు మాత్రం జనసేన నేతలెవరూ ఇష్టపడటంలేదు.