Bird Flu: బ‌ర్డ్ ఫ్లూతో బాలుడి మ‌ర‌ణం.. భ‌య‌ప‌డిపోతున్న ప్ర‌జ‌లు

Bird Flu: క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చాక మాన‌వ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా ఒక్కోసారి క‌రోనా త‌న ప్ర‌తాపం చూపిస్తుంది. ఇప్ప‌టికే చాలా మంది క‌రోనా బారిన ప‌డి క‌న్నుమూసారు. ఈ ప్ర‌ళ‌యం ఇంకా ముగియ‌క‌ముందే కొత్త‌ర‌కం వైర‌స్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ వైర‌స్‌లు కూడా చాలా డేంజ‌ర్ అని శాస్త్ర‌వేత్తలు చెబుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు.

బ‌ర్డ్ ఫ్లూ అనే వ్యాధి మానవాళికి పెద్ద‌గా ఇబ్బంది క‌లిగించ‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. కాని ఈ ఫ్లూ వ‌ల‌న ఢిల్లీ ఎయిమ్స్‌లో 11 ఏళ్ల బాలుడు క‌న్నుమూసాడు. బాలుడికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ప్ర‌స్తుతం ఐసోలేష‌న్ లో ఉన్నారు.ల‌క్ష‌ణాలు ఏమైన క‌నిపిస్తే వెంట‌నే తెలియ‌ప‌ర‌చాల‌ని వైద్య నిపుణులు వారికి స‌ల‌హా ఇచ్చారు.

బ‌ర్డ్ ఫ్లూ అనే వ్యాధి గురించి ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వింటున్నాం. దీని వ‌ల‌న ఇటీవ‌లి కాలంలో చాలా ప‌క్షులు, కోళ్లు మ‌ర‌ణించాయ‌ని విన్నాం. కాని ఇప్పుడు హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు బ‌ర్డ్ ఫ్లూతో మ‌ర‌ణించడం ఆందోళ‌న క‌లిగిస్తుంది. న్యుమోనియా, లుకేమియా ల‌క్ష‌ణాల‌తో ఈనెల 2న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సుశీల్‌కు మొద‌ట క‌రోనా ప‌రీక్ష నిర్వ‌హించారు. అందులో నెగెటివ్ వ‌చ్చింది.

న‌మూనాల‌ను పుణెలోని జాతీయ వైరాల‌జీ సంస్థ‌కు పంపించ‌గా, అందులోబ‌ర్డ్ ఫ్లూ అని తేలింది. దీంతో ఆ బాలుడి కాంటాక్ట్ ట్రేస్ చేయ‌డానికి నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజీ కంట్రోల్ ఓ బృందాన్ని హ‌ర్యానాలోని బాలుడి స్వ‌గ్రామానికి పంపింది. బ‌ర్డ్ ఫ్లూతో భార‌త్‌లో మ‌ర‌ణించిన తొలి కేసు ఇదే కాగా దీనిని హెచ్ 5 ఎప్ 1 వైర‌స్ లేదాఏవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజాగా పిలుస్తారు. సాధార‌ణంగా ఇది ప‌క్షులు, కోళ్ల‌లోనే వ‌స్తుంది.

ఈ నెల 15న బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ జాతి అయిన హెచ్‌5ఎన్‌6 స్టెయిన్ చైనాలో ఓ వ్య‌క్తికి సోకిన‌ట్టు ప‌లుమీడియా సంస్థ‌లు వెల్ల‌డించాయి. ఈ ఏడాది ప్రారంభంలో భార‌త్‌లో ఈ వైర‌స్ విరుచుకుప‌డ‌గా, పంజాబ్‌లో50వేల ప‌క్షులు క‌న్నుమూసాయి. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, ఛ‌త్తీస్‌గ‌డ్, కేర‌ళ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్,ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో కూడా ఈ కేసులు వెలుగు చూశాయి. బ‌ర్డ్ ఫ్లూ మ‌న‌షుల‌కి ఇన్‌ఫెక్ష‌న్ క‌లిగించ‌డం త‌క్కువ శాతంలో ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు.