Bipasha Basu: జాలీల మ‌ధ్య నుండి తొంగి చూస్తున్న‌ బిపాసా అందం.. థ్రిల్ అవుతున్న ఫ్యాన్స్

Bipasha Basu: వ‌య‌స్సు పెరిగినా త‌ర‌గ‌ని అందంతో కుర్ర‌కారు మ‌నసులు దోచుకుంటుంది బిపాసా బ‌సు. ఈ బెంగాళీ భామ ‘టక్కరి దొంగ’ సినిమాలో మహేష్ బాబు సరసన మెరిసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

Bipasha Basu

హిందీలో హాట్ హాట్‌గా… జిస్మ్, ధూమ్ సినిమాల్లో అదరగొట్టింది. అవకాశాలు తగ్గడంతో ఆ మధ్య మోడల్ కరన్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకుని సెటిలైంది. అప్పుడ‌ప్పుడు ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ హీటెక్కించింది. తాజాగా బిపాసా ఘాటు అందాలు మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తుంది.

తమిళ, తెలుగు, బెంగాలీ, ఇంగ్లీషు సినిమాలలో కూడా నటించింది. ఈమె భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఈమె అనేక పురస్కారాలను పొందింది. ఈమెను మీడియా తరచుగా సెక్స్ సింబల్‌గా అభివర్ణిస్తూ ఉంటుంది.

Bipasha Basu

2001లో “అజ్‌నబీ అనే థ్రిల్లర్ సినిమాలో ఒక ప్రతికూల పాత్రతో సినిమారంగంలో అడుగు పెట్టింది. ఆ పాత్ర ఈమెకు ఉత్తమ నటి (మొదటి సినిమా) విభాగంలో ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఈమె ప్రధాన పాత్ర “రాజ్” అనే హారర్ సినిమాలో తొలిసారి నటించింది. తరువాత ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి.

అనేక సినిమాలలో ఐటం సాంగ్స్‌లో నటించి మెప్పించింది బిపాసా బ‌సు. జాన్ అబ్రహాం, బాబీ డియోల్, మహేష్ బాబు, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్, పరేష్ రావెల్, కరణ్ సింగ్ గ్రోవర్ వంటి నటుల సరసన నటించింది. విక్రం భట్, సంజయ్ గద్వీ, డేవిడ్ ధావన్, రామ్ గోపాల్ వర్మ, జయంత్ సి పరాన్జీ, కె. విజయ భాస్కర్, అమిత్ సక్సేనా, రోహిత్ శెట్టి, మహేష్ మంజ్రేకర్, విశాల్ భరద్వాజ్, ఆదిత్య చోప్రా, ఋతుపర్ణ ఘోష్, భూషణ్ పటేల్ వంటి దర్శకుల సినిమాలలో నటించింది.