కరోనా వాక్సిన్ ఇండియా వల్లే అవుతుంది : బిల్ గేట్స్

Advertisement

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇక ఈ క్రమంలో మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. అంతేకాదు వ్యాక్సిన్ విషయంలో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మిగతా దేశాల్లో వ్యాక్సిన్‌ ముందుగానే అభివృద్ధి చేసినా.. తయారీలో మాత్రం భారత్‌ సహకారం ఎంతో కీలకమని అన్నారు.

ఖచ్చితమైన, సురక్షితమైన కరోనా వాక్సిన్‌ వచ్చిన వెంటనే, భారత్‌ నుంచి భారీ స్థాయిలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని బిల్‌గేట్స్‌ తెలిపారు. అలాగే భారత్ లో వ్యాక్సిన్ వచ్చే ఏడాదిలో వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఇక ఈ విషయాన్నీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here