Bihar IPS : చిక్కుల్లో చిక్కుకున్న ‘ఖాకీ’.! ఒక్క రూపాయికి 49 లక్షలు.!
NQ Staff - December 10, 2022 / 01:40 PM IST

Bihar IPS : ‘ఖాకీ ది బీహార్’ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన బీహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోఢా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆయన ప్రభుత్వ వుద్యోగాన్ని పర్సనల్ వ్యవహారానికి వాడుకున్నారనేది ఈ ఆరోపణల్లో ప్రధానంగా వినిపిస్తున్న అంశం.
అసలు వివరాల్లోకి వెళితే, ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని అరెస్టు చేసిన తీరుపై ఆయన ఓ బుక్ రాశారు. వావ్.! మన ఖాకీ సోదరునికి ఈ టాలెంట్ కూడా వుందా.? అని ఆశ్చర్యపోతున్నారా.?
ఏవండోయ్ ఆఫీసర్ గారూ.! ఏమనుకున్నారు.? ఇంకేం చేశారు.?
టాలెంట్ వుంది. సరే, ఆ టాలెంట్‌ని ఆయన నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లారు. ఈ బుక్‌లో ఆయన రాసిన కథాంశం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కించాలనుకున్నారు. ఆ క్రమంలోనే ఓ నిర్మాణ సంస్థతో టై అప్ అయ్యారు.
అయితే, కేవలం ఒకే ఒక్క రూపాయితో ఆయన సదరు నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా అధికారిక లెక్కల్లో చూపించారు. కట్ చేస్తే, ఆయన భార్య ఖాతాలో 49 లక్షల రూపాయలు జమ అయినట్లు పోలీసుల లెక్కల్లో తేలింది.
అంటే, అధికారిక ఒప్పందానికి ముందే, ఆయన భార్య ఖాతాలో ఈ అమౌంట్ జమ అయినట్లుగా విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో లోఢాపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. అయ్యో ఆఫీసర్.! ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందో.!